ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించటం లేదు అంటూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్ పై, గతంలో ఇప్పటికే రెండు పర్యాయాలు విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ వేసిందో లేదో చూడాలని చెప్పి, గతంలో జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. అయితే ఈ రోజు కొద్ది సేపటి క్రితం రాష్ట్ర హైకోర్టు ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేసిన పిటీషన్ పై, మళ్ళీ విచారణ జరిపింది. ఈ విచారణలో భాగంగా అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన నీలం సాహనీ, ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖ ప్రినిసిపల్ సెక్రటరీగా ఉన్న గోపాల కృష్ణ ద్వివేదీ, వీళ్ళ ఇద్దరినీ కూడా కోర్టుకు వ్యతిగంగా రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోర్టు ధిక్కరణ పిటీషన్ వేయటంతో, ఈ కోర్టు ధిక్కరణ పిటీషన్ పై ప్రభుత్వం అసలు స్పందించటం లేదని, అదే విధంగా ఎన్నికల కమిషన్ కు కావలసిన వివిధ అవసరాలకు సంబంధించి, గవర్నర్ కు విజ్ఞప్తి చేసినప్పటికి కూడా , రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పిటీషన్ దాఖలు చేసింది. దీని పై విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు ఈ రోజు ఆదేశాలు ఇస్తూ, వచ్చే నెల 22వ తేదీ నాటికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన నీలం సాహనీ, ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖ ప్రినిసిపల్ సెక్రటరీగా ఉన్న గోపాల కృష్ణ ద్వివేదీ కోర్టు ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నీలం సాహనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read