ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ రోజు తన సొంత ఊరు దుగ్గిరాల వెళ్లారు. గుంటూరు జిల్లాలో దుగ్గిరాల ఆయన సొంత ఊరు. అక్కడే ఆయనకు సొంత ఇల్లు, పొలం కూడా ఉంది. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ సొంత ఊరు దుగ్గిరాల వెళ్ళిన సందర్భంలో ఆసక్తికర సన్నివేసం చోటు చేసుకుంది. స్థానిక తహశీల్దార్, నిమ్మగడ్డ ఇంటి వద్ద ఆయనకు స్వాగతం పలికారు. పుష్పగుచ్చం ఇచ్చి ఆయనకు స్వాగతం పలకటంతో, ఎవరు మీరు అని అడగటంతో, స్థానిక తహశీల్దార్ అని సమాధానం చెప్పాటంతో, నేనే మీ ఆఫీస్ కు వద్దాం అనుకున్నా అని, మీరు మా ఇనితి వచ్చారని నిమ్మగడ్డ సమాధానం చెప్పారు. తన ఇంటి లోపలకు తహశీల్దార్ ను తీసుకుని వెళ్ళిన నిమ్మగడ్డ, ఇదే మా ఇల్లు అని చూపించారు. తహశీల్దార్ కు ఇంటి గురించి మొత్తం వివరించారు. నాకు ఇక్కడ ఓటు హక్కు కావాలని, తహశీల్దార్ ను కోరారు. ఈ సందర్భంగా అక్కడ అధికారులతో కూడా నిమ్మగడ్డ మాట్లాడారు. తరువాత అక్కడ ఉన్న స్థానికలు, చుట్టాలు, పాత మిత్రులతో కొద్ది సేపు గడిపారు. ఎన్నికల టెన్షన్ లో, తలముకలు అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎట్టకేలకు ఖాళీ సమయం దొరకటంతో, కొద్ది సేపు, పాత మిత్రులతో కలిసి కాలాక్షేపం చేసారు. ఈ రోజు సాయంత్రం మళ్ళీ ఆయన విజయవాడ చేరుకోనున్నారు.
అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్, హైదరాబాద్ లో ఉన్న తన ఓటును సరండర్ చేసి,గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటు హక్కుకు అప్లై చేసారు. అయితే స్థానిక తహశీల్దార్ తన వినతిని తిరస్కరించారని నిమ్మగడ్డ స్వయంగా తెలిపారు. అయితే తనకు ఎవరి మీద కోపం లేదని, తనకంటే కింద వారని, వారి పై కక్ష తీర్చుకోలేదని, వారిని గౌరవించానని తెలిపారు. తాను విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్ లో ఉంటున్నా అని, రిటైర్డ్ అయిన తరువాత దుగ్గిరాలలో ఉంటాను అని, ఇక్కడే ఇల్లు, పొలం ఉందని, అందుకే ఇక్కడ ఓటు హక్కు అడిగాను అని, స్థానిక తహశీల్దార్ కు అప్లై చేసి, మీ ఆఫీస్ కు వస్తానని చెప్పానని, అయితే తన ఓటు రిజెక్ట్ చేసారని తెలిపారు. అయితే తాను ఇగోకి పోలేదని, వారిని గౌరవించి, కలెక్టర్ కు మరో అర్జీ పెట్టుకున్నా అని, నా అప్లికేషన్ పరిశీలించమని కోరానని, కలెక్టర్ కూడా పట్టించుకోక పొతే కోర్టుకు వెళ్లి, తన హక్కు సాధించుకుంటా అని అన్నారు. ఈ సందర్భంలో ఆయన సొంత ఊరు వెళ్ళటం, అక్కడే తహశీల్దార్ స్వాగతం పలకటం, ఆమెకు ఇల్లు చూపించటం, జరిగాయి. మరి తహశీల్దార్ ఏమి చేస్తారో చూడాలి.