డబ్బేప్రధానంగా వ్యవహరిస్తున్న సమాజంలో, ఆస్తిని, కన్న వాళ్లను కాదనుకున్న ఒకజంట నేడు టీడీపీ కార్యాలయానికి వచ్చిందని, జ్ఞానేందర్ (బీసీ-గౌడ) అనూష (ఎస్సీ-మాల)లవి వేర్వేరు కులాలైనా వారిద్దరూ ప్రేమించుకొని, 2016లో పెళ్లిచేసుకున్నారని, ఆనాటినుంచి ఇరువురివైపు తల్లిదండ్రులు, వారికుటుంబసభ్యులు వారిని పట్టించుకోకపోయినా, జ్ఞానేందర్ ఏదోఒకపనిచేసుకుంటూ, తనభార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడని, వారికి మూడేళ్ల కూతురు కూడా ఉందని, కుటుంబసభ్యుల వేధింపులు తట్టుకోలేక వారు ఆగస్ట్ 2019లో ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నించా రని, ఆయన అపాయింట్ మెంట్ లభించకపోవడంతో, జగన్మోహన్ రెడ్డి తల్లిగారైన విజయమ్మనుకలిసి వారి సమస్య చెప్పుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. కులాంతరవివాహం చేసుకున్నవారికి తాను అన్నివిధాలా అండగాఉంటానని, అటువంటివారిని తగినవిధంగా ఆదుకుంటా నని గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిఉన్నాడన్నారు. జ్ఞానేందర్ దంపతులు విజయమ్మగారిని కలిశాక, ఆమె వారిగురిం చి, మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు చెప్పడం జరిగిందన్నారు. అదలా ఉంటే, జ్ఞానేందర్ బాబాయిలు, బంధువు లు అతన్నిబెదిరించి, అతనిభార్య అయిన అనూషపై కూడా బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. అనూషపై రకరకాల తప్పుడు కేసులుపెట్టించిన జ్ఞానేందర్ బాబాయిలు ఆమెను ఒకానొక సంద ర్భంలో జైలుకు కూడా పంపించారన్నారు. తనకు వచ్చే స్థిరచరాస్తు లను కూడా కాదనుకొని జ్ఞానేందర్ , అనూషతోనే జీవించడానికి సిద్ధపడిపోయాడన్నారు. జ్ఞానేందర్ బంధువుల్లో కొందరు పోలీస్ అధికారులు ఉన్నారని, వారంతా వారి పలుకుబడితో అనూషను బెదిరించడానికి, జ్ఞానేందర్ నుంచి ఆమెను విడదీయడానికి శతవిధాలా ప్రయత్నించారన్నారు. విజయమ్మ ఆదేశాలతో జ్ఞానేందర్ దంప తులకు న్యాయంచేస్తానని, వాసిరెడ్డి పద్మ 27-08-2019న ఒక సమావేశంలో విలేకరులతో చెప్పిందని అశోక్ బాబు తెలిపారు. వాసిరెడ్డి పద్మను కలిసిన అనంతరం, జ్ఞానేందర్ దంప తులు మంత్రి పేర్నినానిని కలిసి, తమకు న్యాయం చేయమని కోరినా వారికి ఎటువంటి న్యాయంజరగలేదన్నారు. కులాంతర వివాహంచేసుకొని, ఇన్నికష్టాలను ఎదిరించివారు నిలబడినా కూడా, ఇప్పటికీ ఆస్తిలో హక్కుకోసం జ్ఞానేందర్ తిరిగివస్తాడనే దురాలోచనతోఅతన్ని, అతనిభార్యను వెంటాడుతూనే ఉన్నారన్నా రు.
జ్ఞానేందర్ బాబాయి అయిన సుబ్రహ్మణ్యం సీఐగా పనిచేస్తున్నారని, మరోబంధువైన వెలివెల సత్యనారాయణ రామ గుండం పోలీస్ కమిషనర్ గా ఉన్నారని, వారి పలుకుబడితో, ఆ దంపతులు ఎక్కడికెళ్లినా బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితు లే ఎదుర్కొన్నారన్నారు. నెలకో ఉద్యోగం, సంవత్సరానికో ఊరు తిరుగుతూ, ఆదంపతులు నానా అవస్థలు పడుతున్నా, విజయమ్మ, మంత్రి పేర్నినాని, వాసిరెడ్డి పద్మలు వారికి ఎటువంటి న్యాయం చేయకపోవడం దురదృష్టకరమని అశోక్ బాబు వాపోయా రు. ఇటువంటి పరిస్థితుల్లో జ్ఞానేందర్ దంపతులు, నేడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిగారిని కలిసి తమగోడు వెళ్లబోసుకు న్నారన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆ దంపతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. అవసరమైతే వారి రక్షణకోసం డీజీపికి లేఖరాస్తానని తగినవిధంగా ఆర్థికసాయం చేస్తామని కూడా మాజీముఖ్యమంత్రి గారుహామీ ఇచ్చారన్నారు. జ్ఞానేందర్ కేవలం పదోతరగతి మాత్రమే చదివాడని, అతని చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడని, అనూషను పెళ్లిచేసుకున్నాక, పెళ్లి సర్టిఫికెట్ కూడా రాకుండా దాన్ని జ్ఞానేందర్ బాబాయి చింపేయడం జరిగింద న్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సదరు దంపతులు నానా అవస్థ లు పడుతూ, దినదినగండంగా బతుకుతుంటే, మంత్రి పేర్నినాని వారిని ఆదుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఆ దంపతులకు న్యాయం చేయాలని కోరుతూ, తాము అవసరమైతే డీజీపీని, మంత్రి పేర్ని నానీని కలవడానికి తాముసిద్ధంగా ఉన్నామని అశోక్ బాబు స్పష్టం చేశారు. జ్ఞానేందర్ తాతగారు రాజమహేంద్రవరం, వక్కల గడ్డ ప్రాంతాల్లో ఎప్పుడో భూములు కొన్నాడని, వాటిలో అతనికి హక్కుఉందని, ఆ భూములు అతనికి ఇవ్వకుండా కొట్టేయాలన్న అక్కసుతోనే జ్ఞానేందర్ బాబాయిలు అతనిపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరుఏమీ చేయాలని చూసినా, జ్ఞానేందర్ కు, అతని భార్యాపిల్లలకు తాము అండగా ఉంటామని ఎమ్మెల్సీ అశోక్ బాబు తేల్చిచెప్పారు.