గత రాత్రి జీవీఎంసీ కమీషనర్ గా ఉన్న గుమ్మళ్ళ సృజనని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఆమె స్థానంలో నాగలక్ష్మిని అపాయింట్ చేసారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే, చీఫ్ సెక్రటరీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ కి ముందే, జీవీఎంసి కమీషనర్ గా ఉన్న సృజన 15 రోజులు సెలవు పెట్టి, వెళ్ళటం జరిగింది. అయితే అత్యవసరంగా ఆమె సెలవులో ఉన్న సమయంలో కూడా ఈ ఉత్తర్వులు ఇవ్వటం వెనుక ప్రధానంగా, కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జీవీఏంసి పరిధిలోని రిజర్వేషన్ల విషయంలో కొన్ని ఫిర్యాదులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వెళ్ళటం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే జీవీఎంసి కమీషనర్ కి, స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటు వంటి కలెక్టర్ కు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా కొన్ని రిజర్వేషన్ల విషయంలో, కొంత వరకు నియమ నిబంధనలు పాటించలేదు, కొందరికి రిజర్వేషన్లు కావాలని ఇచ్చారని, కొన్ని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ జరుగుతుంది. మరోకటి ఏమిటి అంటే, వార్డులు డివిజన్ విషయంలో కానీ, ఓటర్ నమోదు విషయంలో కూడా, కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయం పై, విశాఖకు చెందిన వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసారు.
ఈ విషయంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఆమెను బదిలీ చేయాలనే నిర్ణయం తీసుకుని, ఆమెను బదిలీ చేయాలనే ఆదేశాలు ఇచ్చినట్టు, తెలుస్తుంది. ఈ నేపధ్యంలోనే ఆమెను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారనే వాదన వినిపిస్తుంది. అయితే అంతకు ముందే ఆమె సెలవు పెట్టినప్పటికీ, ఆమెను ఎందుకు బదిలీ చేసారనే విషయం పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. అయితే దీని పై ఆమె ఇప్పటి వరకు ఈ బదిలీ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే గత మూడేళ్ళుగా ఇక్కడే పని చేస్తున్న సృజనను నిబంధనలు ప్రకారం బదిలీ చేయాలని, ఎలాగూ ఎస్ఈసి బదిలీ చేస్తుందని గ్రహించి, ముందే ఆమెను సెలవు పై పంపించి, ఇంచార్జ్ ను నియమించారని, ఎన్నికలు అయిన తరువాత మళ్ళీ సృజనను అక్కడే ఉంచాలని, ఒక ప్రముఖ నాయకుడు వేసిన పాచిక పారలేదని, ఇంచార్జ్ కుదరదని, ఫుల్ టైం కమీషనర్ ను నియమించాలని ఎస్ఈసి ఆదేశాలు ఇచ్చారని ఒక ప్రముఖ పత్రికలో వార్త వచ్చింది. ఇప్పుడు ఫుల్ టైం కమీషనర్ ను నియమించారు కాబట్టి, మళ్ళీ ఎన్నికలు అయిపోగానే,అధికారి సృజనను మళ్ళీ ఇక్కడకు తీసుకు వస్తే అనేక సాంకేతిక ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి ఆ ప్రముఖ నాయకుడు పాచికను, ఎన్నికల కమిషన్ చిత్తు చేసిందని చెప్తున్నారు.