రాష్ట్రంలో ఒక పక్క ఎన్నికలు జరుగుతుంటే, ఎన్నికల కమిషన్ మాట అధికారులు వినవద్దు అంటూ, మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యల పై, ఈ రోజు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటూ, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, మంత్రిగా విధులు నిర్వహించాల్సి వచ్చినప్పుడు ఆయన బయటకు రావచ్చు అని, మిగతా సమయం ఇంటికి పరిమితం అవ్వాలి అంటూ, ఆ సమయంలో మీడియాతో కూడా మాట్లాడకూడదు అని, డీజీపికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల పై డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. తనకు ఇంకా ఆదేశాలు అందలేదని అన్నారు. గత 40 నిమిషాలుగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నానని, తనకు ఇంకా విషయం తెలియదు అని అన్నారు. మరి ఆదేశాలు చూసిన తరువాత డీజీపీ ఎలా స్పందిస్తారో చూడాలి. మరో పక్క ఈ ఆదేశాల పై స్పందించిన పెద్దిరెడ్డి, ఆ ఆదేశాలు అమలు అవుతాయో లేదో తెలుసుకుని, నిమ్మగడ్డ ఆదేశాలు ఇస్తే బాగుండేది అంటూ, వ్యాఖ్యలు చేసారు. తాను చేసేది తాను చేస్తాను అంటూ, మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read