ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక పక్క ఇప్పటికే హైకోర్టు, సుప్రీం కోర్టులో చీవాట్లు పెట్టినా, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేయటం ఆపేలేదు. ఈ రోజు ఉదయం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన అసాధారణ ఏకగ్రీవాల పై, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టి, వాటి పై పరిశీలన జరిపిన తరువాతే, ఏకాగ్రీవాలు ప్రకటించాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే దీని పై మంత్రి పెద్దిరెడ్డి, తన పరిధిలో లేని అంశం పై కూడా మాట్లాడారు. ఏకంగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలకు తల ఊపితే మీ సంగతి చూస్తాం అంటూ అధికారులకు హెచ్చరికలు జారీ చేసారు. ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు విని, ఇష్టం వచ్చినట్టు చేస్తే, ఏప్రిల్ 1 తరువాత మీ సంగతి చూస్తాం అని, మిమ్మల్ని ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు బ్లాక్ లిస్టు లో పెడతాం అంటూ బెదిరించారు. ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు చేస్తే, మీ పై చర్యలు తీసుకుంటాం అని అన్నారు. ఎలక్షన్ కమిషన్ చేస్తున్న పిచ్చి పనులు, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటే, అధికారులకు కుదరదని అన్నారు. మార్చ్ 31 దాకా ఏమైనా చేసుకోండి, ఏప్రిల్ 1 నుంచి మీ సంగతి చూస్తాం అంటూ బహిరంగంగా బెదిరించారు. ఎలక్షన్ కమిషన్ మాటలు వినాలి అనుకుంటే, మీకు తిగిన శాస్తి చేస్తాం అంటూ బెదిరించారు.

అయితే మంత్రి బెదిరింపులు పై, తెలుగుదేశం స్పందించింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలి ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ''రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి సహకరించినా చర్యలు తీసుకుంటాం''... అని పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడడం రాజ్యాంగ వ్యవస్థలను అవమానించడమే. మంత్రి వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వ అధికారులను బహిరంగంగా బెదిరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తక్షణమే రాష్ట్ర క్యాబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకపోతే స్థానిక సంస్థల ఎన్నికలే వేదికగా ప్రజలందరూ వైకాపా బలపరిచిన అభ్యర్థులను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలోనే రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీరం చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పేర్కొనడం గర్హనీయం. ఒకవైపు హింసాయుతంగా బెదిరింపు చర్యలతో ఏకగ్రీవాలకు పాల్పడుతూ, మరోవైపు రాత్రింబవళ్లు రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్న అధికారులను అవమానపరుస్తూ హెచ్చరికలు జారీ చేయడం దుర్మార్గం. ఉద్యోగులకు న్యాయబద్దంగా ఇవ్వాల్సిన గవర్నమెంటు ప్రావిడెంట్ ఫండ్ నిధులు అడ్డుకుంటు ఈ విధంగా వేధిస్తారా? పంచాయతీరాజ్ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆగ్రహాలను కప్పిపుచ్చుకునేందుకు అధికారులను పావుగా వాడుకుంటున్నారు. పీఆర్సీ, సీపీఎన్, డీఏలు, ఎల్టీసీలు ఇవ్వకుండా ఉద్యోగులపై ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు. మంత్రి పెద్దిరెడ్డి ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్ లు, ఐపీఎస్ ల పై దాడికి పాల్పడుతుంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఎందుకు నోరు మెదపడంలేదు? ఎందుకు ఖండించడంలేదు? ఎందుకు భయపడుతున్నారు?
అని పి. అశోక్ బాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read