ఎన్నికలసందర్భంగా వివిధపార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేయడమనేది సహజంగా జరిగిదేనని, టీడీపీ ‘పల్లె ప్రగతికి పంచసూత్రాలు’ అనేపేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఏం తప్పుందో చెప్పాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్రకుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. టీడీపీ విడుదలచేసిన మేనిఫెస్టోలోని అంశాలను పరిశీలిస్తే, గ్రామాల్లోని ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడం, గ్రామా ల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పడం, బాలికా విద్యను ప్రోత్సహించడం, పల్లెల్లో ఎల్ఈడీ దీపాల ఏర్పాటు, గ్రామస్థాయిలోని ప్రభుత్వభూములను కాపాడటం, ఆదర్శగ్రామాలుగా పల్లెలను తీర్చిదిద్దడం, స్వయంసహాయక సంఘాలు, గ్రామస్తుల సహకారంతో గ్రామాలను అభివృద్దిచేయడం, వంటి అంశాలతో పల్లెప్రగతికి పంచసూత్రాలు పేరుతో టీడీపీ మేనిఫె స్టో విడుదలచేసిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మేనిఫెస్టోపై అధికారంలో ఉన్న వైసీపీ ఎందుకంతలా ఉలిక్కిపడుతుందో తెలియ డం లేదన్న నరేంద్ర, అద్భుతాలు చేస్తూ, గ్రామాలను అభివృద్ధిలో పరుగులపెట్టిస్తున్నామని చెప్పుకుంటున్న అధికారపార్టీనేతలు , టీడీపీ మేనిఫెస్టోనుచూసి ఎందుకు ఓర్వలేకపోతున్నారో సమా ధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో అద్భుతమైన పాలన సాగుతు న్నప్పుడు ప్రతిపక్ష మేనిఫెస్టోపై ఫిర్యాదుచేయాల్సిన అవసరం అధి కారపార్టీవారికి ఎందుకొచ్చిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహ స్యం చేసేలా అడుగడుగునా రాష్ట్రంలో అధికారపార్టీ వారు చేస్తున్న ఆగడాలను అందరూగమనిస్తూనే ఉన్నారన్నారు. వాలంటీర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని ప్రభుత్వం ప్రజలను బెదిరిస్తూ ఓట్లు రాబట్టాలనిచూస్తోంద న్నారు. పింఛన్లు తొలగిస్తామని, రేషన్ కార్డులు తీసేస్తామని, ఇళ్లపట్టాలుఇవ్వమని, అమ్మఒడి ఇతరత్రా పథకాలను ఆపేస్తామని వాలంటీర్లు బెదిరిం చడం దేనికి సంకేతమో ప్రభుత్వం సమాధానంచెప్పాలన్నారు. గ్రామస్థాయి వైసీపీనేతల ఆగడాలకు అడ్డే లేకుండా పోయిందన్నారు.

టీడీపీ మేనిఫెస్టోపై వైసీపీ ఫిర్యాదుతో, ఎన్నికల కమిషన్ తమ మేనిఫెస్టోను ఉపసంహరిం చుకోవాలని ఆదేశించిందని, ఎస్ఈసీ ఆదేశాలను తాము గౌరవిస్తా మని నరేంద్ర తెలిపారు. గ్రామాల రూపురేఖలు, విధానాలు మార్చే దకు తమపార్టీ అభిప్రాయాన్ని తెలియచేశామని, ఒక రాజకీయ పార్టీగా ప్రజలతో తాము పంచుకునేభావాలను, ఆలోచనలను తెలియచేసే హక్కు తమకుందనే వాస్తవాన్ని కొన్ని వ్యవస్థలు గుర్తి స్తే మంచిదన్నారు. దేశస్థాయిలో కూడా ఈవ్యవహారంపై చర్చ జరగాలని తాము అభిప్రాయపడుతున్నామన్నారు. రాజ్యాంగ పరంగా తమకున్న పరిధిలోనే ఈ అంశంపై తాము పోరాటం చేస్తా మన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం గ్రామాలు స్వయంపరిపాలన కోరుకుంటాయని, ఒకకీలకమైన రాజకీయపార్టీగా తాము ఆ దిశగానే మేనిఫెస్టోను విడుదలచేశామని నరేంద్ర స్పష్టంచేశారు. గ్రామాల అభివృద్ధికి తాము ఏంచేస్తామో చెబుతూ విడుదల చేసిన మేనిఫెస్టోపై వైసీపీ ఎందుకంతలా గగ్గోలు పెడుతుందో తెలియడం లేదన్న ఆయన, ఒకరాజకీయపార్టీగా తమకున్న పరిధిలోనే పల్లె ల అభివృద్ధికి ఏంచేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నా రు. దేశంలో ఇదివరకే అనేకపార్టీలు పంచాయతీఎన్నికల్లో మేని ఫెస్టోలు విడుదలచేశాయన్నారు. ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తూనే,రాజకీయ పార్టీగా మాకున్న హక్కులపై మరోసారి విశ్లేషణ చేస్తామని నరేంద్ర స్పష్టంచేశారు. గ్రామాలకు ఏవైతే అవస రమో, వాటినే తాము మేనిఫెస్టోలో ప్రస్తావించామన్నారు. గ్రామాల అభివృద్ధిని అడ్డుకునే ప్రక్రియలో భాగంగానే తమపార్టీ మేనిఫెస్టోను అడ్డుకోవడం జరిగినట్లుగా తాము భావిస్తున్నామన్నారు. వాలంటీ ర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకొని అధికారపార్టీ చేస్తున్న ఆగడాలు, బెదిరింపులపై తాము ఎస్ఈసీకి ఫిర్యాదుచేశామని, కానీ ఎస్ఈసీ ఎప్పటినుంచోసాగుతన్న వ్యవస్థకాబట్టి, దానిపై చర్యలు తీసుకోలే మని చెప్పడం జరిగిందన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read