తొలివిడత పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గతంలో తనకున్న నేరచరిత్రను, నేరస్వభావాన్ని చూపించి, అధికారయంత్రాంగాన్ని ఓటర్లను భయపెట్టేందుకు తీవ్ర మైన ప్రయత్నాలు చేస్తున్నాడని, ఆఖరికి ఎన్నికలకమిషనర్ పై కూడా బెదిరింపులకు దిగాడని, టీడీపీ నేత, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పెద్దిరెడ్డి జీవితమంతా నేరాలమయమని, ఆయన పీలేరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రామ్మోహన్ రెడ్డి అనేనేతను చం-పిం-చా-డ-ని, ఆతరువాత వరుసగా కొన్నిహ-త్య-లు జరిగాయని శ్రీనివాసరెడ్డి తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాలను, ఎర్రచందనాన్ని నరికేగ్యాంగ్ ను, ఎర్రచందనం రవాణాచేసే వ్యవస్థను, పెద్దఎత్తున సమకూర్చుకొని ఈ రాష్ట్రంనుంచి రామచంద్రామరెడ్డే భారీస్థాయిలో దోపిడీకి పాల్పడుతున్నారనే దానిపై పెద్ద చర్చే జరిగిందన్నారు. ఎర్రచందనం అక్రమరవాణాతో కోట్లకుకోట్లు సంపాదించి, తననేరసా మ్రాజ్యాన్ని ఆయన విస్తరించుకున్నాడన్నారు. అధికారం లేనప్పుడు ఎక్కడో మడుగులోదాక్కొని, తలొంచుకొని తిరిగిన వ్యక్తి, నేడు అధికారంరాగానే మళ్లీ తననేరస్వభావాన్ని, విశృంఖలంగా వ్యాపింపచేస్తున్నాడన్నారు. చిత్తూరుజిల్లా తనఅడ్డా అంటూ, అక్కడజరిగే అవినీతి, అక్రమాలను ప్రశ్నించేవారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడన్నారు. డాక్టర్ అనితా రాణి, జడ్జీ రామకృష్ణల ఘటనలే అందుకు నిదర్శనాలనని మర్రెడ్డి చెప్పారు. జగన్మోహన్ రెడ్డిపై మోదీ కన్నెర్రచేస్తే, కాలం కలిసొచ్చి ఆయన జైలుకు వెళితే, ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్న పెద్దిరెడ్డి తీసుకొచ్చిన మద్యం పాలసీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. పేదలసొమ్ముని కల్తీమద్యంద్వారా పీల్చు కుంటున్నారని ప్రశ్నించిన పాపానికి దళితయువకుడు ఓంప్రతాప్ హ-త్యకావించబడ్డాడన్నారు. ఓంప్రతాప్ హ-త్య-కు గల కారణాలను, అందుకు కారకులైనవారిని పోలీసులు ఇంతవరకు పట్టుకోలేక పోయారన్నారు. చనిపోయిన ఓంప్రతాప్ కాల్ డేటాను కూడా పోలీసులు బయటపెట్టలేకపోయారంటే, పెద్దిరెడ్డి రౌడీరాజకీయం ఏస్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చన్నారు.
జడ్జీరామకృష్ణ స్థలాన్నిఆక్రమించి, అతన్నే ఇంటినుంచి బయటకురాకుండా నిర్బంధించిన వైనాన్నికూడా చూశామన్నారు. ఈ విధంగా అడుగడుగునా నేరపూరితస్వభావంతో ఉన్న పెద్దిరెడ్డి, నేడు ఎన్నికలకమిషనర్ ని ఉద్దేశించి వాడు-వీడుఅని దూషించే స్థాయికి వచ్చాడన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ యొక్క వికృతరూపమే ఈ ఘటనలన్నింటికీ ప్రధానకారణమని మర్రెడ్డి తేల్చిచెప్పారు. తంబళ్లపల్లెలో, పుంగనూరు నియోజకవర్గాల్లో టీడీపీతరుపున నామినేషన్లు వేయడానికి వస్తున్నవారిపై ఏవిధంగా దా-డు-ల-కుపాల్పడుతున్నారో, నామినేషన్లు వేయనీయకుండా ఎలాఅడ్డుకుంటున్నారో రాష్ట్రమంతా గమనిస్తూనే ఉందన్నారు. టీడీపీనేత నల్లారికిషోర్ కుమార్ రెడ్డిపై, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డిపై తంబళ్లపల్లెలో ఏవిధంగా దా-డి-కి పాల్పడ్డారో చెప్పాల్సిన పనిలేదన్నారు. ప్రజల దురదృష్టంకొద్దీ పెద్దిరెడ్డికి పంచాయతీ రాజ్ శాఖ దక్కిందని, ఆయన శాఖకు సంబంధించిన పంచాయతీల్లో నేడు ఎన్నికలుజరుగుతుంటే, గ్రామస్వరాజ్యం దిశగా చర్యలుతీసుకోవాల్సిన వ్యక్తే, పచ్చనిపల్లెల్లో అక్రమాలను, అరాచకాలను పెంచిపోషిస్తున్నాడన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉండాలని, జగన్ కుధీటుగా తన ప్రభవెలగాలన్న దురుద్దేశంతో, తనకున్న నేరస్వభావంతో పెద్దిరెడ్డి ఎన్నికలవాతావరణాన్ని కలుషితంచేశాడన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థను, ఎన్నికల కమిషన్ ను బెదిరిస్తూ మాట్లాడటం భయభ్రాంతులకు గురిచేయడంకాక ఏమవుతుందన్నారు. మార్చి 31తర్వాత ఎవరిపై చర్యలు తీసుకుంటాడో, ఎందుకు తీసుకుంటాడో రామచంద్రారెడ్డే చెప్పాలన్నారు. ఆఖరికి బయట తిరగడానికికూడా ఆయన కోర్టు అనుమతి తీసుకునే పరిస్థితి వచ్చిందంటే, అందుకు కారణం ఆయన కాదా అని మర్రెడ్డి నిలదీశారు. ఎర్రచందనం, ఇసుక, మద్యం,మైనింగ్ మాఫియాలను అడ్డుపెట్టుకొని వేలకోట్లుసంపాదించి, విస్తరించిన నేరసామ్రాజ్యం ఏదోఒకరోజు కూకటివేళ్లతో సహా పెకలించివేయబడక తప్పదనే వాస్తవాన్ని పెద్దిరెడ్డి గ్రహిస్తే ఆయనకే మంచిదని శ్రీనివాసరెడ్డి హితవుపలికారు. పెద్దిరెడ్డి చేస్తున్న నేరాలకు తగినఫలితం అనుభించక తప్పదన్నారు. రామచంద్రారెడ్డిలా వ్యవహరించే ప్రతిఒక్కరూ ఎప్పటికైనా సరే కృష్ణజన్మస్థానానికి చేరకతప్పదని, ఆయన ఇప్పటికైనా తన నేరస్వభావాన్ని తగ్గించుకుంటే మంచిదని టీడీపీనేత హితవుపలికారు.