విశాఖ నార్త్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత గంటా శ్రీనివాస రావు, తన ఎమ్మల్యే పదవికి రాజీనామా చేస్తూ, స్పీకర్ తమ్మినేనిని లేఖ పమించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నాట్టు, గంటా శ్రీనివాస్ తన రాజీనామా లేఖలో తెలిపారు. పార్టీలకు అతీతంగా నాన్ పొలిటికల్ జేఏసి ఏర్పాటు చేస్తామని, అన్ని పార్టీలతో కలిసి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటాం అని గంటా తెలిపారు. అయితే గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తారో లేదో చూడాలి. ఇప్పటికే విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడుకోవటానికి, రెండు రోజులుగా పెద్ద ఉద్యమం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా, జగన్ మోహన్ రెడ్డి మాత్రం, ఇప్పటి వరకు స్పందించకపోవటం గమనార్హం. అయితే, నిన్న వైసీపీ ఎంపీలు కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో, లైవ్ లో మైక్ అఫ్ లో ఉంది అనుకున్న, విశాఖ స్టీల్ ప్లాంట్ పై మనల్ని ఏమి మాట్లాడవద్దు అని చెప్పిన వీడియో బయటకు వచ్చింది. మొత్తంగా ఈ విషయంలో కేంద్రానికి తోడుగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా గేమ్ ఆడుతుందని, ఈ చర్యలతో అర్ధం అవుతుంది. మరి దీని పై, ప్రజా ఉద్యమం చూసి అయినా, జగన్ మోహన్ రెడ్డి ఉద్యమం పై స్పందిస్తారేమో చూడాలి.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా...
Advertisements