ఒక పక్క ఎన్నికలు జరుగుతున్నాయి. ఎంతటి గొప్ప ప్రభుత్వం అయినా, ఎన్నికల కమిషన్ మాటలు వినాలి. అది మన రాజ్యాంగం చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లెక్క చేయటం లేదు. అసలు ఎన్నికల విధుల్లో మంత్రులు జోక్యం చేసుకోవటం అనేది పరాకాష్ట అనే చెప్పాలి. ఇక విషయానికి వస్తే చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఏకాగ్రీవాలు అసాధారణంగా ఉండటంతో, ఎలక్షన్ కమిషన్ వాటి పై దృష్టి పెట్టింది. మిగతా జిల్లాలతో పోలిస్తే, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకాగ్రీవాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని ఎన్నికల కమిషన్ పరిశీలిన చేసి నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు ఏకగ్రీవాల ఫలితాలు ప్రకటించ వద్దు అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇందులో తప్పు ఏముందో కానీ, మంత్రి పెద్దిరెడ్డి భగ్గుమన్నారు. నిజానికి ఎన్నికల కమిషన్ ఎంక్వయిరీ చేసి, ఏమి లేదు అని చెప్తే, అందరికీ మంచిదే కదా. నిజంగానే అందరూ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుందని, ఎవరి బలవంతంగా లేకుండా ఎన్నికలు ఏకగ్రీవం అయ్యారని అనుకుంటే, ఇది ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ వైపే, ప్రభుత్వ పెద్దలు వేలు చూపించి, ఇది ప్రజలకు మా మీద ఉన్న నమ్మకం అని చెప్పవచ్చు .

peddireddy 060220212

దీనికి భిన్నంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి, ఎవరూ నిమ్మగడ్డ మాట వినాల్సిన పని లేదని, వెంటనే ఏకాగ్రీవాలు ప్రకటించాలని ఆదేశించారు. అధికారులు అలా చేయకపోతే, ఎన్నికలు అయిన తరువాత బ్లాక్ లిస్టు లో పెడతాం అని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఏకంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలకు దిక్కు లేకపోతె, ఇంకా ఎన్నికలు ఎందుకు అని టిడిపి ప్రశ్నించింది. అయితే మంత్రి పెద్దిరెడ్డి శ్రుతిమించి వ్యాఖ్యలు చేయటంతో, ఈ రోజు ఎన్నికల కమిషన్ స్పందించింది. మంత్రి పెద్దరెడ్డి పై సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని డీజీపీని ఆదేశించింది ఎన్నికల కమిషన్. ఆయన మీడియాతో కూడా మాట్లాడనివ్వకుండా చూడాలని ఆదేశించింది. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. ప్రజలు నిర్భయంగా ఓటేసేందుకే ఈ చర్యలు తీసుకున్నామని, మంత్రిని 21 వరకు బయటకు రాకుండా చూడాలని డీజీపీని ఆదేశించింది. మరి దీని పై ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read