జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అటు పరోక్షంగా కేంద్రం పైన నిందలు వేస్తూనే, జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన తీరు, ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. ఇటీవల రాష్ట్రంలో దేవాలయాల పై జరుగుతున్న వరుస ఘటనలకు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆక్టివ్ అయిన దగ్గర నుంచి, అధికార వైసీపీ పార్టీకి ఊపిరి ఆడటం లేదు. ముఖ్యంగా 140 ఘటనలు జరిగినా, దాని పై ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యపు వైఖరి అందరినీ ఆలోచించచేస్తుంది. దీంతో ఆ దోషులు ఎవరో పట్టుకుని, ప్రజలకు సమాధానం చెప్పాల్సింది పోయి, జగన్ మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి, ఇది ప్రతిపక్షం చేస్తున్న కుట్ర, నేను ఎప్పుడు పధకాలు ప్రారంభం చేసినా, దాన్ని డైవర్ట్ చేయటానికి, ఇలా చేస్తున్నారు, ప్రతిపక్షాలు నా పై గెరిల్లా వార్‌ఫేర్ చేస్తున్నాయి అంటూ, సానుభూతి పొందే ప్రయత్నాలు చేసారు. అయితే దీని పై ప్రతిపక్షాలు కూడా ఘాటుగానే స్పందించాయి. మొత్తం 140 ఘటనలు జరిగితే, కేవలం ఏవో ఒక 9 సంఘటనలు చెప్పి, ప్రతిపక్షాల పై బురద వేసి, ఇప్పటి వరకు ఒక్కరిని కూడా పట్టుకోకుండా, జగన్ మోహన్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారు అంటూ విరుచుకు పడ్డాయి. తాజాగా ఈ విషయం పై స్పందించిన పవన్ కళ్యాణ్, సంచలన వ్యాఖ్యలు చేసారనే చెప్పాలి.
హైకోర్టు చీఫ్ జస్టిస్ ని, ఇతర న్యాయమూర్తులను ఒక్క లేఖతోనే ట్రాన్స్ఫర్ చేసే మీరు ఎంతో శక్తి కలిగిన వారు కాదా, మీ పైనే గెరిల్లా వార్‌ఫేర్ చేసేంత ధైర్యం ఎవరికి ఉంది జగన్ గారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు పవన్. అంటే పరోక్షంగా, కేంద్రం కూడా జగన్ లేఖకు తలొగ్గింది అనే విధంగా పవన్ స్పదించారు. మీ దగ్గర 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 22 మంది ఎంపీలు మీ వైపు ఉన్నారు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, ఇలా ఇంట పెద్ద వ్యవస్థని మీ చేతిలో పెట్టుకుని, ఇప్పటి వరకు మీరు ఎవరినీ పట్టుకోలేదు అంటే, విడ్డూరం అనే చెప్పాలి అంటూ పవన్, పరోక్షంగా ఇవి ప్రభుత్వం చేస్తుందా అనే విధంగా స్పందించారు. డాక్టర్ సుధాకర్ పై ప్రతాపం చూపిస్తారు, సోషల్ మీడియాలో మీ పై రాస్తే కేసులు పెడతారు, అలాంటిది దేవుళ్ళ పై జరిగితే ఘటనలకు ఎందుకు స్పందించరు అని పవన్ ప్రశ్నించారు. గొప్పగా మాకు ఎన్నో లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు అని చెప్పుకుంటారు కాదా, మరి ఇన్ని ఘటనలు జరిగితే ఒక్క వాలంటీర్ కూడా పట్టుకోలేక పోయారా ? అని పవన్ ప్రశ్నించారు. లోపం ఎక్కడ ఉంది ? మీలోనా, మీ వ్యవస్థలోనా అంటూ పవన్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు నుంచి తప్పుకుని, ప్రతిపక్షాల పై నేట్టేస్తున్నారని అన్నారు.