టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, పోలీస్ అధికారుల సంఘం తీరు పై విరుచుకు పడ్డారు... ఆయన మాట్లాడుతూ.. "పోలీస్ అధికారుల సంఘం విడుదలచేసిన లేఖలో, రాజకీయ స్వలాభంకోసం పోలీసులకు మతాలు ఆపాదించొద్దన్నారు. ఎవరు ఎవరికి మతాలు ఆపాదించారో తెలిసే లేఖరాశారా? ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ ముగ్గురూ క్రిస్టియన్లేనని, వారంతా ఒకేమతానికి చెందినవారయినప్పుడు, హిందూమతంపై జరుగుతున్న ఘటనలకు సంబంధించి ఇంకా ఎక్కువబాధ్యతతో వ్యవహరించా లని చంద్రబాబు సూచిస్తే అది తప్పెలా అవుతుంది? ఆయన చెప్పినదాన్ని తప్పుపడుతూ, లేఖలో ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన నాయకుడని సంబోధిస్తారా? జనకుల శ్రీనివాసరావు, మస్తాన్ ఖాన్, సోమశేఖర్ రెడ్డి వంటివారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. 14ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి గురించి ఇష్టానుసారం మాట్లాడతారా? తన రాజకీయ జీవితంలో 40ఏళ్లపాటు ప్రజలకుసేవ చేసిన మచ్చలేని వ్యక్తి చంద్రబాబునాయుడు. ఆయన పనితనం, వ్యక్తిత్వం, గొప్పతనం తప్పుడుసమాచారంతో లేఖలు రాసిన పోలీస్ అధికారులసంఘం నేతలకు ఎలా తెలుస్తాయిలే. వైసీపీఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి “బొంగులో పోలీసులు, నాకాళ్ల దగ్గర పడుంటారు” అన్నప్పుడు పోలీస్ అధికారుల సంఘం నేతలు ఏమైపోయారు? అధికార పార్టీ వారు పోలీసులను నోటికొచ్చినట్లు దూషించినప్పుడు ఈ అసోసి యేషన్ నేతలంతా తాడేపల్లి ప్యాలెస్ లో అంట్లు తోముతున్నారా? "

police 07012021 1 2

"ఉండవల్లి శ్రీదేవి ఒకసీఐని పట్టుకొని “అరేయ్ మెంటల్, నాకాళ్లు పట్టుకుంటే నీకు పోస్టింగ్ ఇచ్చానురా” అన్నప్పుడు జనకుల శ్రీనివాసరావు ఏమయ్యాడు. కాసు మహేశ్ రెడ్డిపై, ఉండవల్లిశ్రీదేవి పైచర్యలు తీసుకోవడానికి, లేఖలురాయడానికి పోలీస్ అసోసియేష న్ అధికారులకు ధైర్యం సరిపోలేదా? చంద్రబాబునాయుడు హాయాంలో ఏపీ పోలీస్ వ్యవస్థ దేశంలోనే నెం-1స్థానంలోఉంది. జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగే పోలీసులను మాత్రమే తాము తప్పుపడుతున్నాము. నిజాయితీగా పనిచేసేవారికి ఇప్పటికీ సెల్యూ ట్ చేస్తున్నాము. జంగారెడ్డి గూడెంలో ఎస్ ఐ దుర్గారావు చనిపోయినప్పుడు పోలీస్ అసోసియేషన్ ఏమైపోయింది? దుర్గారావు మరణానికి ఎవరు కారకులో జనకుల శ్రీనివాసరావుకి తెలియదా? పోలీస్ అసోసియేష న్ నాయకులమంటూ ఇష్టానుసారం ప్రవర్తిస్తే, చట్టపరంగా గట్టిగానే సమాధానం చెబుతామని హెచ్చరిస్తున్నాము. నిజంగా పోలీస్ అసోసియేషన్ కు ధైర్యముంటే, పోలీసులను బూతులుతిట్టిన వైసీపీఎమ్మెల్యేలకు లేఖలురాస్తే మంచిది. కొంతమంది పోలీస్ అధికారుల అత్యుత్సాహం వల్ల నిజాయితీగా పనిచేసే అధికారులు మానసికక్షోభ అనుభవిస్తున్నారు. కాబట్టి పోలీస్ అసోసియేషన్ సంఘం పద్ధతిగా ఉంటే మంచిది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శాశ్వతం కాదని పోలీస్ అధికారుల సంఘం గుర్తిస్తే మంచిది." అంటూ తన ప్రసంగం ముగించారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read