ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రంలో పేకాట శిబిరాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయనే సంగతి అందరికీ తెలిసిందే. అయుదు నెలల క్రిందట కర్నూల్ లో ఏకంగా మంత్రి జయరాం సొంత గ్రామంలో, మంత్రి బంధువులే దొరికారు. ఇకా ఆ తరువాత, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేకాట శిబిరాల పై చేసిన ఆడియో వైరల్ అయ్యింది. అయితే ఆమె తరువాత దాన్ని ఖండించారు అనుకోండి. ఇక గుడివాడలో మంత్రి కొడాలి నాని పై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఈ విషయం చెప్తూ వస్తుంది. అయితే మొన్న పవన్ కళ్యాణ్ వెళ్లి బహిరంగంగా చెప్పటంతో, ఈ విషయం హైలైట్ అయ్యింది. రాష్ట్రం మొత్తం మీద గుడివాడలోనే పెద్ద పెద్ద శిబిరాలు ఉంటాయనే విషయం ఓపెన్ సీక్రెట్. పోలీసులు అడపా తడపా దాడులు చేస్తున్నా, ఈ పెద్ద పెద్ద చేపల వైపు ఎప్పుడూ రాలేదని చెప్పాలి. అయితే ఎందుకో కానీ, ఉన్నట్టు ఉండి నిన్న నందివాడలో రైడ్ జరిగింది. పెద్ద పెద్ద తలకాయలు దొరికారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, గుడివాడ పోలీసులకు సమాచారం లేకుండా, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పక్కాగా స్కెచ్ వేసి, ఎవరూ తప్పించుకోకుండా వారిని పట్టుకోవటం. మంత్రి అనుచరులకు ఎలాంటి లీక్ లేకుండా ఈ రైడ్ చేసారని ప్రచారం జరుగుతుంది. ఇంత పక్కాగా ఎవరు చేపించారు అనేది ఇప్పుడు ప్రశ్న.

kodali 04012021 2

ఇక రైడ్ జరిగిన తరువాత కూడా, సమాచారం బయటకు పొక్కకుండా ఎంత ట్రై చేసినా, బయటకు లీక్ అయ్యింది. ముఖ్యమైన అనుచరులను వదిలేయాలని లాబీయింగ్ చేసినా వర్క్ అవ్వలేదని అంటున్నారు. అయితే ఈ రోజు మంత్రి కొడాలి నాని, జగన్ ని కలిసారు. కలిసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు కూడా వింతగా ఉన్నాయి. నా అనుచరులు ఉంటే ఏమవుతుంది, ఫైన్ కడతారు, బయటకు వస్తారు,మళ్ళీ ఆడతారు అంటూ మాట్లాడారు. అంటే, జగన్ మోహన్ రెడ్డి దగ్గర భరోసా దొరకేలదని అర్ధం అవుతుంది. దీంతో ఇంత పక్కాగా దాడులు చేయటం వెనుక ఏదో పెద్ద స్కెచ్ ఉందనే ప్రచారం జరుగుతంది. ఇన్నాళ్ళు అందరికీ తెలిసినా, ఎప్పుడూ అటు వైపు వెళ్ళిన పోలీసులు, ఇప్పుడే ఎందుకు వెళ్ళారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీ మాత్రం, వాటాల్లో తేడా వచ్చి, రైడ్ చేపించారని, అ కమిషన్ ల తేడా పైనే ఈ రోజు జగన్ ని కలిసి, ఇష్యూ సెటిల్ చేసుకున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా, ఈ పేకాట శిబిరాలు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడితే చాలని ప్రజలు అనుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read