జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, రెవిన్యూ వ్యవస్థ చేయాల్సిన పనులు కూడా, వాలంటీర్లు అంటూ మరో వ్యవస్థ పెట్టి, వారి చేత కొన్ని పనులు చేపిస్తూ, తన ప్రభుత్వానికి ఇది ఎంతో ప్రతిష్టాత్మకం అని చెప్పుకుంటూ ఉంటారు. అంతే కాదు, వాలంటీర్ ఉద్యోగులు నాలుగు లక్షల మందికి ఇచ్చాం, ఇది మేము కల్పించిన ఉపాధి అని కూడా వైసిపీ నాయకులు చెప్పుకుంటూ ఉంటారు. ఇక విజయసాయి రెడ్డి లాంటి నేతలు అయితే, మరో అడుగు ముందుకు వేసి, 90 శాతం వాలంటీర్ ఉద్యోగాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చేసాం అంటూ, బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఇలాంటి వాలంటీర్లు, తమ చేత చాకరీ చేపించుకుంటున్నారు, అన్ని పనులు మాపైనే వేస్తున్నారు, అందరి చేత మాటలు పడుతున్నాం, మాకు ఇచ్చే జీతం మాత్రం 5 వేలా, మాకు జీతం పెంచాలి అంటూ, పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తుంది అనుకుంటే, జగన్ మోహన్ రెడ్డి నుంచి ఒక బహిరంగ లేఖ వాలంటీర్లకు వచ్చింది. అందులో ఉన్న విషయాలు చూసి వాలంటీర్లు అవాక్కయ్యారు. తమ జీతాల పెంపు గురించి, తమ డిమాండ్ల గురించి, తమ శ్రమ దోపిడీ గురించి మాట్లాడకుండా, సేవ చేసి సన్మానాలు పొందండి అనే విధంగా ఆ లేఖలో ఉంది. నిన్న రాత్రి వాలంటీర్లను ఉద్దేశించి, జగన్ మోహన్ రెడ్డి ఒక బహిరంగ లేఖ రాసారు. అందులే అసలు విషయం చెప్పేసారు జగన్. వాలంటర్ అంటే స్వచ్చంధంగా పని చేసే వారని గుర్తు చేసారు.
మీరు చేసేది ఉద్యోగం కాదు, స్వచ్చంద సేవ అనేది గుర్తుపెట్టుకోవాలని రాసారు. వాస్తవానికి దూరంగా జీతాలు పెంచాలని రోడ్దేక్కటం బాధించిందని లేఖలో పేర్కొన్నారు. వాలంటీర్లకు ఇచ్చిన హ్యాండ్ బుక్ లోనే, మీకు ఇచ్చేది గౌరవభృతి అనేది స్పష్టంగా రాసాం అని, అది ఒకసారి గుర్తు చేసుకోవాలని కోరారు. ఇంతకంటే మెరుగైన ఉద్యోగాలు వచ్చే దాకా, ఈ సేవ చేయమని కోరామని, దాని కోసం గౌరవభృతి ఇస్తాం అని తెలిపామని చెప్పారు. మీరు కూడా మీకు వీలుని బట్టి, వారిని మూడు రోజులు, మీ ఇష్టం వచ్చిన సమయంలో వచ్చి సేవ చేస్తున్నారు. ఇలా సేవ చేసినందుకు, ప్రజల ఆశీస్సులు పొందుతున్నారు అని తెలిపారు. మీరు సేవ చేస్తున్నారు కాబట్టే, మీకు ప్రజల్లో గౌరవం ఉందని, మీరు జీతం తీసుకుంటే, మీకు ఈ గౌరవం వచ్చేదా అని ప్రశ్నించారు. అలాగే మీరు బాగా పని చేస్తే, మీకు శాలువా కప్పి సన్మానం చేస్తున్నారు, ఇలాంటి మీరు, ఎవరో రెచ్చగోడితే, ఇలా రోడ్డు ఎక్కటం బాధించింది, వారికి దూరంగా ఉండి, మీ సేవ మీరు చేయండి అంటూ, జీతం పెంపు గురించి మాత్రం ఎక్కడ చెప్పలేదు. మరి వాలంటీర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.