గత కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబ్దోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారం చేసింది ఏబీఎన్ కావటంతో, రాధాకృష్ణ పై వైసీపీ నేతలు పడిపోయారు. అయితే ఇప్పుడు అదే నిజం కాబోతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఏబీఎన్ కధనం ఖండిస్తూ, ఒక పత్రికా ప్రకటన షర్మిల నుంచి వచ్చినా, అందులో ఎక్కడా తాను పార్టీ పెట్టటం లేదు అని మాత్రం చెప్పలేదు. అయితే ఈ రోజు ఉన్నట్టు ఉండి షర్మిల నుంచి కొంత మంది సన్నిహితులకు ఫోన్లు వెళ్ళాయి. దీంతో వైఎస్ షర్మిల రేపు లోటస్ పాండ్ లో ఏర్పాటు చేసిన సమావేశం పై అందరికీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ సమావేశానికి కేవలం నల్గొండ జిల్లాకు సంబందించిన వారినే షర్మిల ఫోన్ చేసి, రమ్మని చెప్పినట్టు తెలుస్తుంది. రేపు ఎల్లుండి, ఈ సమావేశాలు జరుగుతాయని, వైఎస్ఆర్ అభిమానులను, వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారిని రావాలని, ఆహ్వానాలు అందాయి. సమావేశంలో పాల్గునబోయే నాయకులు కొంత మంది, మాకు ఈ సమావేశానికి రావాలని ఫోన్ వచ్చిందని చెప్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి బలం చేకురుంది. షర్మిల రేపు నిర్వహించే సమావేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే షర్మిల సొంత పార్టీ పెట్టబోతున్నారని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారానికి రేపు తెర పడనుంది.

sharmila 080222021 2

ఆమె రేపు పార్టీ పెట్టకపొతే వెంటనే ఖండిస్తారని, పార్టీ పెట్టే ఉద్దేశం ఉంటే మాత్రం, ప్రతి జిల్లా అభిమానాలను పిలిచి మాట్లాడి అభిప్రాయం తీసుకుంటారని, దానికి రేపు నాంది పలుకుతారని అనుకోవచ్చు అనే ఊహగానాలు వస్తున్నాయి. సమావేశంలో షర్మిల ఏమి చెప్పబోతున్నారు అనే విషయం ఇప్పుడు వైఎస్ అభిమానుల్లో ఉంది. సమావేశం జరిగే లోటస్ పాండ్ దగ్గర అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, లోటస్ పాండ్ లోనే షర్మిల నివాసం కూడా ఉందని, అక్కడే ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం వస్తుంది. అయితే ఇప్పటికే వైఎస్ జగన్ అధికారంలో ఉండటం, జగన్ కు, షర్మిలకు మధ్య గ్యాప్ వచ్చింది అనే చర్చ జరుగుతుంది. అధికారం వచ్చిన తరువాత, షర్మిలను దూరం పెట్టటం, తనను, తన తండ్రిని తిట్టిన వాళ్ళకు మంత్రి పదివి ఇచ్చిన జగన్ కు, తాను పనికరానా అనే భావన రోజు రోజుకీ ఎక్కువ అయ్యి, ఇక్కడ దాకా వచ్చిందని చెప్తున్నారు. ఇక మరో పక్క, ఇద్దరి మధ్య సయోద్య కోసం ప్రయత్నం చేసినా, జగన్ వైపు నుంచి సహకారం లేదని, అందుకే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చిందని చెప్తున్నారు. ఈ ఊహాగానాలు అన్నిటికీ రేపు తెర పడనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read