జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రంగులు పిచ్చి ఎలాంటిదో ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. తమ పార్టీ రంగులు కనిపించిన ప్రతి దానికి వేసేసి చేసిన రచ్చ ఏంటో అందరికీ తెలిసిందే. చివరకు ప్రజలు అందరూ వెళ్ళే పంచాయతీ భవనాలు, స్కూల్స్, ప్రభుత్వ ఆఫీస్ లు,ఇలా వీటికి కూడా వైసీపీ రంగులు వేసిన సంగతి తెలిసిందే. కనీస స్పృహ కూడా లేకుండా చేసిన ఈ పని వల్ల అటు హైకోర్టులో, అటు సుప్రీం కోర్టులో కూడా చీవాట్లు తిన్నారు. చివరకు చీఫ్ సెక్రటరీ పై కోర్టు ధిక్కరణ వరకు వ్యవహారం వెళ్ళింది. మళ్ళీ రంగులు అన్నీ తీసి, వేరే రంగు వేయాల్సి వచ్చింది. ఈ చర్యతో దాదాపుగా 4 వేల కోట్లు దుర్వినియోగం అయ్యింది అంటూ, హైకోర్టులో మరో పిటీషన్ కూడా దాఖలు అయ్యింది. అయితే కోర్టు తీర్పుతో అయినా ఈ రంగులు పిచ్చి పోతుందని అందరూ అనుకున్నారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం, మళ్ళీ రంగులతో నింపేసింది. అసలు ప్రభుత్వ ఆస్తులకు, వైసీపీ రంగులు ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. తాజాగా బియ్యం సప్లై చేసే వ్యాన్ లకు, వైసీపీ రంగులతో పాటుగా, జగన్, రాజశేఖర్ రెడి బొమ్మలు వేసారు. అయితే ఇలాంటివి ఎన్నికల సమయంలో చెల్లవు అని చిన్న పిల్లలకు కూడా తెలుసు. చివరకు ఊరిలో ఉండే విగ్రహాలకు కూడా ముసుగులు వేస్తారు కాదా, ఇలాంటివి ఎలా ఒప్పుకుంటారు ?

vans 09022021 2

ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉండటంతో, వైసీపీ రంగులు, జగన్, రాజశేఖర్ రెడ్డి బొమ్మ ఉన్న వ్యాన్లు ఆపేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. మీరు తిప్పాలి అనుకుంటే, రంగులు మార్చాలని సూచించింది. అదీ కాకుండా ఇప్పుడు పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, పట్టణాల్లో తిప్పుకోవచ్చని చెప్పింది. అయితే ప్రభుత్వం ఈ ఆదేశాల పై మళ్ళీ కోర్టుకు వెళ్ళింది. వ్యాన్ ల మీద రంగులు మార్చాలి అంటే, మూడు నెలలు పడుతుందని, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ రేపు విచారణకు వచ్చే అవకాసం ఉంది. అయితే ఇక్కడ ప్రభుత్వం పట్టింపు కాకపొతే, ఏమి లేదు. ఒకటి ఎన్నికలు అయ్యేంత వరకు ఆపుకుని, ఎప్పటి లాగా డీలర్లతో ఇప్పించవచ్చు. లేదు అంటే, ఈ నెలాఖరుతో ఎలాగూ పంచాయతీ ఎన్నికలు అయిపోతాయి కాబట్టి, వచ్చే నెల నుంచి యదావిధిగా తిప్పుకోవచ్చు. ఇప్పుడు ఎలాగూ ఇలానే చేస్తున్నారు కదా ? పట్టణాల్లో ఎక్కడా ఆంక్షలు లేవు కదా ? మరి ప్రభుత్వం రంగులు విషయంలో మళ్ళీ ఎందుకు కోర్టుకు వెళ్తుందో, వారికే తెలియాలి. ఏది ఏమైనా రేపు కోర్టు ఇచ్చే డైరెక్షన్ ఎలా ఉన్నా, అదే ఫైనల్ కాబట్టి, చూద్దాం కోర్టు ఏమి చెప్తుందో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read