రాష్ట్ర దేవాదాయా శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరోసారి తన చేష్టలతో వార్తల్లో నిలిచారు. ప్రతిసారి నోటికి పని చెప్పి, వార్తల్లో నిలిచే మంత్రికి, ఈసారి కూడా ఆగ్రహం వచ్చింది. ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజికవర్గంలోని 49వ డివిజన్ లో, ఆయన పర్యటించారు. కొన్ని కార్యక్రమాల్లో పాల్గుని, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా చేసారు. అయితే ఈ నేపధ్యంలో స్థానికంగా ఉన్న కొన్ని సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం చూడాలి అంటూ స్థానిక ప్రజలతో పాటు, జనసేనకు చెందిన కొంత మంది నాయకులు, ఒక వినతి పత్రాన్ని తయారు చేసి మంత్రికి ఇచ్చారు. అది చదివిన వెల్లంపల్లి, గత 5 ఏళ్ళుగా మీరేమి చేయలేకపోయారు, ఇప్పుడు నాకు వినతి పత్రం ఇస్తారా అని చెప్పి ఎదురు నిలదీయటంతో, కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. మంత్రి ఇచ్చిన జవాబుతో ఆశ్చర్యపోయిన ప్రజలు, మంత్రి ఇలా ప్రవర్తించటం ఏమిటి అంటూ, వ్యతిరేక నినాదాలు చేసారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన వెల్లంపల్లి శ్రీనివాస్, గత 5 ఏళ్ళలో మీరేమి పీకకుండా, మమ్మల్ని బెదిరిస్తారా అంటూ, అసభ్య పదజాలం వాడారు. అంతే కాకుండా, అక్కడ ఉన్న పోలీసులను పిలిచి, వీళ్ళందరినీ ఇక్కడ నుంచి ఎత్తి పారేయండి అంటూ, పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేసారు.

vellampalli 11022021 2

మంత్రి ప్రవర్తనతో, అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పరిస్థితి, ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. మంత్రి వెల్లంపల్లికి వ్యతిరేకంగా జనసేన నాయకులతో పాటు, స్థానికులు కూడా వ్యతిరేక నినాదాలు చేసారు. గతంలో ఎన్నికల ముందు డివిజన్ లో పర్యటించిన వెల్లంపల్లి శ్రీనివాస్, నన్ను గెలిపిస్తే మీకు ఉన్న సమస్యలు అన్నీ పరిష్కరిస్తానని హామీలు ఇచ్చి, ఫోటోలు దిగారని, ఆ ఫోటోలు కూడా చూపిస్తూ నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారికి సర్ది చెప్పి, అక్కడ నుంచి పంపించి వేసారు. అయితే ఒక సమస్యను పరిష్కరించాల్సిన హోదాలో ఉన్న మంత్రి, అయితే అవుతుంది చెప్పాలి, లేకపోతే ప్రయత్నం చేస్తామని, అదీ లేకపోతే ఇది కుదరదు అని ప్రత్యామ్నాయం చూపించాలి కానీ, ఇలా చేయటం ఏమిటి అంటూ స్థానికులు తప్పు బడుతున్నారు. సమస్యను పరిష్కరించమంటే, అప్పుడు మీరేమి పీకారు అంటూ చెప్పటం పై, అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇప్పుడు ఏమి చేసారో చెప్పండి అంటే, అప్పుడు ఏమి చేసారు అని తప్పించుకోవటం పై, ప్రజలు అభ్యంతరం చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read