వైసీపీలో నోటికి పని చెప్తూ, బూతులు మంత్రిగా పేరు తెచ్చుకున్న కొడాలి నానికి ఎట్టకేలకు ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. మొన్నటి వరకు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పై ఇష్టం వచ్చినట్టు మంత్రి కొడాలి నాని మాట్లాడిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ మా బొచ్చు పీకుతాడా అంటూ జుబుక్సాకరంగా కూడా మంత్రి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే అప్పట్లో ఎన్నికలు లేకపోవటంతో, ఈ విషయం పై ఎన్నికల కమీషనర్ కేవలం గవర్నర్ కు ఫిర్యాదు చేసి వదిలేసారు. అయితే ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉండటంతో, ఈ సందర్భంగా కొడాలి నానీ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ నోటికి పని చెప్పారు. అయితే ఈ సారి మాత్రం ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకోలేదు. మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసు పంపించింది. సాయంత్రం 5 గంటల లోపల, ఆయన వ్యక్తిగతంగా కానీ, ఆయన ప్రతినిధి ద్వారా కానీ, ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ కు వచ్చి వివరణ ఇవ్వాలని కోరింది. కొద్దిసేపటి క్రితం మంత్రి కొడాలి నానీ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ కు, దురుద్దేశాలు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేసారు. దీంతో మంత్రి మాట్లాడిన పూర్తి వీడియోను ఎన్నికల కమిషన్ పరిశీలించింది. పరిశీలించిన తరువాత, ఈ వ్యవహారం పై నోటీసులు ఇవ్వాలని భావించిన నేపధ్యంలో, సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసారు.

kodali 12022021 2

ఎన్నికల కమిషన్ జాయింట్ సెక్రటరీ పేరుతో ఈ నోటీసు జారీ చేసారు. మంత్రి కొడాలి నాని సంతృప్తికర సమాధానం ఇవ్వని పక్షంలో, తదుపరి చర్యలు ఉంటాయని, ఎన్నికల కమిషన్ ఆదేశించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఇలాంటి ఆక్షనే తీసుకున్న పరిస్థితి ఉంది. చివరకు ఆయన కోర్టుకు వెళ్లి, కొంత మేరకు రిలీఫ్ పొందారు. నిన్న జోగి రమేష్ పై కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. ఈ రోజు మంత్రి కొడాలి నాని పై కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. ముందు నుంచి కూడా కొడాలి నానీ, ఎన్నికల కమిషన్ పై పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. కమీషనర్ పై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయితే అప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి, కొడాలి నాని ఆటలు సాగాయి. ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉండటం, ఎన్నికల కమీషనర్ కు అధికారం ఉండటంతో, ఈ రోజు కొడాలి నాని పై చర్యలకు, ఉపక్రమించారు. మరి మంత్రి కొడాలి నాని వివరణ ఇస్తారా లేదా అనేది చూడాలి. దీని పై ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read