కృష్ణా జిల్లా పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల పై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. కొద్ది సేపటి క్రితం, ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం, ఈ నెల 17 వరకు కూడా, మీడియాతో మాట్లాడవద్దు అని, ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా,ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే విధంగా, జోగి రమేష్ వ్యవహరించటానికి వీలు లేదని, ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున కాకుండా, వేరే పార్టీ తరుపున ఎవరైనా ఎన్నికల్లో పాల్గుంటు, నామినేషన్ వేస్తే, వాళ్లకు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సంక్షేమ పధకాలు కట్ చేయాలి అంటూ, జోగి రమేష్ నిన్న వ్యాఖ్యలు చేసారు. నిన్నటి నుంచి ఈ వీడియో వైరల్ కావటం, ప్రధాన మీడియాలో రావటం, అలాగే వివిధ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటంతో, వీడియోలు పరిశీలించిన ఎన్నికల కమిషన్, జోగి రమేష్ పై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17 వరకు మీడియాతో మాట్లాడకూడదు అని, అలాగే ఎన్నికల అధికారులను కానీ, మిగతా వారిని కానీ బెదిరించే విధంగా మాట్లాడటానికి వీలు లేదని స్పష్టం చేసింది. ప్రచారంలో పాల్గున్నప్పుడు కానీ, మిగత సందర్భాల్లో కానీ, ఎన్నికల ప్రక్రియ పై ప్రభావం పడే విధంగా మాట్లాడకూడదు అని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ అమలు చేయాలని, ఈ క్షణం నుంచి ఉత్తర్వులు అమలులోకి వస్తాయని తెలిపింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read