ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమి పాపం చేసుకుందో కానీ, ఎప్పుడూ ఏదో ఒక ఆందోళనతో అట్టుడుకుతూనే ఉంటుంది. 2014 ముందు వరకు సమైఖ్యాంధ్ర పోరాటం అంటూ రోడ్డుల మీద పడ్డాం. అయినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఆ విభజన కూడా అన్యాయంగా చేసారు. ఎన్నో విభజన హామీలు ఇచ్చినా, ఒక్కటీ నెరవేరలేదు. 2014 నుంచి వాటిని సాధించుకోవాలి అనే పోరాటాలతోనే సరిపోయింది. ఇప్పటికి 7 ఏళ్ళు అయినా, ఆతీ గతీ లేవు. ఇవన్నీ ఢిల్లీలో ఉన్న వాళ్ళు చేసినవి అయితే, 2019 నుంచి మూడు ముక్కల రాజధాని అంటూ, మన రాష్ట్రం చేసిన తప్పుతో, మళ్ళీ వెనుకబడ్డాం. ఎలా అయినా అమరావతి నుంచి వైజాగ్ వెళ్లిపోవాలి అని జగన్ మోహన్ రెడ్డి ఎంత ప్రయత్నం చేస్తున్నా కుదరటం లేదు. ఇప్పుడు అదే వైజాగ్ లో మరో ఉద్యమం వచ్చి పడింది. అదే ఆంధ్రుల ఉక్కు సంకల్పంతో సాధించుకున్న, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ. గత 20 రోజుల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం చేస్తున్నాం అంటూ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దగ్గర నుంచి, పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది. అయితే అధికార వైసిపీ పార్టీ పై, ఈ విషయంలో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఈ విషయం పై వైసీపీకి మాట్లాడటానికి మూడు రోజులు పట్టింది. ఈ విషయం తెలిసిన మరుసటి రోజు వైసిపీ ఎంపీలు ప్రెస్ మీట్ పెట్టి సమయంలో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడవద్దు అన్నారు అంటూ, వాయిస్ లీక్ అవ్వటంతో, అనుమనాలు బలపడ్డారు.

steel 14022021 2

పోస్కో కంపెనీతో విజయసాయి రెడ్డి డీల్ కుదిర్చి, జగన్ వద్దకు తెచ్చారని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను, పోస్కో కంపెనీకి కట్టబెట్టటానికి, డీల్ సెట్ అయ్యిందని, దీని వెనుక పెద్ద ఎత్తున ఆర్ధిక లావాదేవీలు ముడిపడి ఉన్నాయని టిడిపి ఆరోపిస్తుంది. అయితే జగన్ మోహన్ రెడ్డి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై, ప్రధానికి ఒక లేఖ రాసి ఊరుకున్నారు. ఈ నేపధ్యంలోనే, జగన్ మోహన్ రెడ్డి, ఈ నెల 17న వైజాగ్ వెళ్తున్నారు. శారదాపీఠం వార్షికోత్సవాల్లో పల్గునటానికి ఆయన వైజాగ్ వెళ్తున్నారు.ఇప్పటికే పెద్ద ఎత్తున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఉద్యమం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి, ఆ రోజున దీక్షా స్థలం వద్దకు వచ్చి, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతారా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఒక వేళ వస్తే కనుక, తన పై వస్తున్న అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టేయవచ్చు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం జరుగుతున్న ప్రాంతానికి వచ్చి, మద్దతు ఇవ్వకపొతే ప్రతిపక్షాలకు ఒక ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. ఇది ఆత్మగౌరవ పోరాటం కాబట్టి, జగన్ వచ్చి మద్దతు తెలుపుతారనే అందరూ ఆశిస్తున్నారు. మొత్తానికి 17వ తేదీ తేలిపోనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read