ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక ఎన్నికల విషయంలో, ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత వారంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఎన్నికలు జరపటానికి వీలు లేదు అంటూ, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ కు వెళ్ళింది. వ్యాక్సిన్ వేయాలని, అందుకే ఎన్నికలు పోస్ట్ పోన్ చేయాలని కోరారు. అయితే దీని పై వెకేషన్ బెంచ్ కు వెళ్ళగా, హైకోర్టు సింగల్ బెంచ్ ముందు ప్రభుత్వం పిటీషన్ వేయగా, సింగల్ బెంచ్, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తూ, ఎన్నికల షెడ్యుల్ నిలిపివేశారు. అయితే దీని పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్ లో అపీల్ చేయగా, దీని పై కొత్తగా వచ్చిన చీఫ్ జస్టిస్ తో పాటు, మరో జస్టిస్ కలిసి ఈ కేసు విచారణ చేపట్టారు. ఈ పిటీషన్ పై ఇరు వర్గాల వాదన రెండు రోజులు పాటు విన్నారు. తీర్పుని రిజర్వ్ లో పెట్టారు. ఈ రోజు దీని పై తీర్పు ఇచ్చారు. ఎన్నికల కమిషన్ వేసిన రిట్ అప్పీల్‍ పిటిషన్‍ను అనుమతించిన హైకోర్టు, గతంలో ఇచ్చిన సింగల్ జడ్జి తీర్పుని కొట్టేసినట్టే భావించాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించు కోవచ్చని హైకోర్టు తెలిపింది. ఎన్నికలతో పాటు, ప్రజారోగ్యం, రెండు ముఖ్యమే అని హైకోర్టు చెప్పింది. దీంతో ఇక ఎన్నికలకు అడ్డు లేదనే చెప్పాలి.

hc 2101021 2

అయితే దీని పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాసం ఉంది. అయితే ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో, ఎన్నికలు నిర్వహించాలి అంటూ, సుప్రీం కోర్టు తీర్పులు ఇస్తూ వచ్చింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళినా, అక్కడ ఉపసమనం లభించే అవకాసం లేదనే చెప్పాలి. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే, ప్రభుత్వ ఉద్యోగులు కూడా, ఈ పిటీషన్ లో ఇంప్లీడ్ అయ్యి తమ వాదన కూడా వినాలని, ఎన్నికలు జరపవద్దు అని వేయగా, ఆ పిటీషన్ ని హైకోర్టు మొదటి రోజే కొట్టేసింది. కాబట్టి, ఇక ఉద్యోగులు కూడా కోర్టు, ఎన్నికల కమిషన్ చెప్పినట్టే వినాలి. ప్రభుత్వం మాటలు విని, తమ ఇష్టం అంటే ఇక కుదిరే అవకాశం లేదు. ఇక ఈ పూర్తి తీర్పు, మరి కొద్ది సేపట్లో అప్లోడ్ చేస్తారు. అప్పుడు పూర్తి వివరాలు తెలిసే అవకాసం ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత వరకు తాము ఎన్నికలు జరపం అనే విధంగా వ్యవహరిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఏమి చేస్తుందో చూడాలి. ఇప్పటికైనా వివాదాలకు పోకుండా, ఎన్నికలకు వెళ్తారని ఆశిద్దాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read