స్థానిక సంస్థల ఎన్నికల వేడి, ఆంధ్రప్రదేశ్ లో తారా స్థాయికి చేరింది. గంట గంటకు పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్ రమేష్ కుమార్ ,ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు. మరో పక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు బ్రేక్ వేయాలని, రాష్ట్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తున్న సమయంలో, ఈ రోజు ఎలా అయినా ఎన్నికల నోటిఫికేషన్ ఆపాలని ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయంత్నం చేసింది. ఉదయం సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్ లో తప్పులు తడకలు ఉండటంతో, ఈ రోజు పిటీషన్ విచారణకు రాకుండా పోయింది. మళ్ళీ సోమవారం వరకు కుదరదు అని తెలియటంతో, ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు కలిసి హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసాయి. ఈ పిటీషన్ వెంటనే విచారణ చేయాలి, సుప్రీం కోర్టుని కోరాయి. అయితే సుప్రీం కోర్టు మాత్రం, హౌస్ మోషన్ పిటీషన్ ను తిరస్కరించింది. సోమవారం ఈ పిటీషన్ పై విచారణ చేస్తామని చెప్పింది. అయితే ఇప్పటికే ఎన్నికల కమీషనర్ ఈ విషయంలో కేవియట్ పిటీషన్ దాఖలు చేసారు కాబట్టి, సోమవారం విచారణ సందర్భంగా, ఎన్నికల కమిషన్ కు నోటీస్ ఇచ్చి, మళ్ళీ వాయిదా వేస్తారు. ఆ రోజు ఎలాంటి స్టే కానీ, ఏమి ప్రకటించే అవకాసం ఉంది. మళ్ళీ ఒక రోజో, రెండో రోజు కానీ పుర్తిగా విచారణ చేయరు.

sc 220120021 2

ఇక ఈ లోపు రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్న నేపధ్యంలో, ఎన్నికల ప్రక్రియ మొదలు అయిపోతుంది. సుప్రీం కోర్టు గత తీర్పులు కానీ, ఇతర రాజ్యాంగ పరమైన విషయాలు కానీ చూస్తే, ఇప్పటి వరకు కోర్టులు ఎన్నికల విషయంలో జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. దీంతో, ప్రభుత్వానికి ఉన్న చిట్ట చివరి అవకాసం అయిన హౌస్ మోషన్ పిటీషన్ కూడా , ఈ రోజు దారులు మూసుకుపోయాయి. ప్రభుత్వం మాత్రం, ఇప్పటికీ మేము సిద్దంగా లేము అంటూ ఎన్నికల కమిషన్ కు ఉత్తరాలు రాస్తుంది. ఒక పక్క హైకోర్టు చెప్పిన తరువాత కూడా, మేము ఎన్నికలకు సిద్ధంగా లేమని, తేల్చి చెప్తున్నారు. ఉద్యోగుల చేత కూడా ఇదే చెప్పిస్తున్నారు. మరి రాష్ట్ర ఎన్నికల కమీషనర్, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. హైకోర్టు చెప్పినా, రాజ్యాంగంలో ఉన్న, ప్రభుత్వం మాత్రం, ఏ మాత్రం లెక్క చేయటం లేదు. రేపు సుప్రీం కోర్టు చెప్పినా, ఎన్నికల విషయంలో భయపడుతున్న ప్రభుత్వం, ముందుకు వెళ్ళేలా లేదు. ఇక తరువాత అడుగుగా గవర్నర్ జోక్యం చేసుకోవాలి, తరువాత రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి. పరిస్థితి అక్కడి దాకా వెళ్తుందా ? ఏమి అవుతుంది ? చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read