ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొద్ది సేపటి క్రితం, స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు, ఎన్నికల కమిషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు పై స్పందించిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ, రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు , షెడ్యుల్ ప్రకారం జరగుతాయని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు. వచ్చే నెల 5వ తదీ, 9వ తేదీ, 13వ తదీ, 17వ తేదీ, ఈ నాలుగు తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఎన్నికల నోటిఫికేషన్ లు వరుసగా వెలువడతాయని తెలియ చేసారు. ఎన్నికలకు సహకరిస్తామని కోర్టుకు చెప్పినట్టు చెప్పారు. త్వరలోనే చీఫ్ సెక్రటరీ, డీజీపీతో సమావేశం ఏర్పాటు చేసి, దీని పై ముందుకు వెళ్తామని తెలిపారు. మరో పక్క ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు పూజలు నిర్వహించారు. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యుల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించటం, హైకోర్టు కొద్ది సేపటి క్రితం దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా ఇచ్చిన నేపధ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి కొద్ది సేపట్లో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఇందులో ఈ విషయం చెప్పే అవకాసం ఉంది.

nimmagadda 21012021 2

అయితే ఇప్పటికే కొంత మంది మంత్రులు, తమ ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన తీర్పు పై, సుప్రీం కోర్టుకు వెళ్తామని ప్రకటించారు. దీని పై సాయంత్రంలోగా ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో సింగల్ బెంచ్, ఎన్నికల షెడ్యుల్ ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పు పై, ఆ రోజే రాష్ట్ర ఎన్నికల కమిషన్ , డివిజన్ బెంచ్ లో అపీల్ చేసింది. ఎన్నికల్ కమిషన్ పిటీషన్ పై , డివిజనల్ బెంచ్ రెండు రోజుల పాటు వాదనలు వింది. వాదనలు విన్న అనంతరం, డివిజినల్ బెంచ్, రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం, 36 పేజీల తీర్పుని ఇచ్చింది. ఎన్నికల షెడ్యుల్ కొట్టివేస్తే సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని , కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం, స్థానిక ఎన్నికలు జరపటం అనేది, రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధి అని స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం , ఎన్నికల కమిషన్ కు సహకరించాలి అని చెప్పిన ఆదేశాలను కూడా, ఈ తీర్పులో పొందు పరిచింది. ఎన్నికలకు సంబందించిన సహాయ సహకారాలు, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందించాలని పేర్కొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read