ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమైన స్థానిక సంస్థల ఎన్నికల పై, నేడు హైకోర్టులో కీలక తీర్పు వచ్చే అవకాసం ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించే విధంగా, రాష్ట్ర ఎన్నికల కమీషనర్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిర్ణయం పై, యధావిధిగానే రాష్ట్ర ప్రభుత్వం ఎదురు తిరిగింది. ఇప్పుడే ఎన్నికలు జరపలేం అంటూ, హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. అప్పటికే హైకోర్టుకు సెలవలు కావటంతో, ఈ కేసుని వెకేషన్ బెంచ్ ముందు, సింగల్ జడ్జి విచారణ జరిపారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తీసుకున్న నిర్ణయం పై, బ్రేక్ వేసారు. ఎన్నికల షెడ్యుల్ ని సస్పెండ్ చేసారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం పై అపీల్ కు వెళ్ళింది. సింగల్ జడ్జి నిర్ణయం పై, డివిజన్ బెంచ్ లో అపీల్ చేసారు. అయితే ఈ పిటీషన్ ని విచారణకు తీసుకున్న డివిజన్ బెంచ్, ఇప్పటికిప్పుడు ఈ కేసు పై విచారణ ఎందుకు, సెలవులు తరువాత ఈ కేసుని రెగ్యులర్ బెంచ్ వాదిస్తే మీకు అభ్యంతరం ఏమిటి అని కోర్టు ఎన్నికల కమీషనర్ ని ప్రశ్నించింది. అయితే 23న షెడ్యుల్ మొదలు అవుతుందని, 18కి వాయిదా వేస్తే, ఒక వేళ కోర్టు అనుకూల నిర్ణయం ఇస్తే, తమకు ఎన్నికల సంనద్ధతకు తక్కవ సమయం ఉంటుందని తెలిపారు.
అందుకే ఇప్పుడే విచారణ చేయమని కోరారు. ఓటర్ల జాబితాలో గందరగోళం ఉంటుందని, ఎన్నికల కమీషనర్ కోర్టుకు తెలిపారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మేరకే, తాము ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ చేపట్టామని, హైకోర్టుకు తెలిపారు. అయితే దీని పై స్పందించిన ప్రభుత్వ తరుపు నయ్యవాది, ఈ పిటీషన్ ఇప్పటికిప్పుడు విచారణ చేయటం అవసరం లేదని, ఎన్నికల ఓటర్ల జాబితా ఆ సమయానికి సిద్ధం అయిపోతుందని, ఈ పిటీషన్ ని 18కి వాయిదా వేయమని కోరటంతో, డివిజన్ బెంచ్ కూడా ఈ వాదనతో ఏకీభవించి, ఈ పిటీషన్ ని,18కి వాయిదా వేసింది. ఈ పిటీషన్ పై ఈ రోజు వాదనలు జరగనున్నాయి. రాష్ట్ర హైకోర్టు, ఈ పిటీషన్ పై ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో చూడాలి. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరపవద్దని, మరో పక్క ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరపాలని, ఈ నిర్ణయం గత మూడు నాలుగు నెలల నుంచి సాగుతుంది. అయితే ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు జరపటం లేదో అర్ధం కావటం లేదు. ఎందుకు ఎన్నికలు అంటే వెనకాడుతుందో అర్ధం కావటం లేదు.