ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవంగ్ మరోసారి ప్రెస్ మీట్ పెట్టారు. నిన్ననే ప్రెస్ మీట్ పెట్టిన డీజీపీ, మళ్ళీ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టటం అందరినీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. సహజంగా 24 గంటల్లో డీజీపీ ప్రెస్ మీట్ పెట్టారు అంటూ, అది ఎంతో ముఖ్యమైన అంశం అయి ఉంటుంది. అయితే ముఖ్యమైన విషయమే అయినా, ఒకే అంశం పై, నిన్న, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన డీజీపీ గారు, పరస్పర విరుద్ధంగా ఒకే అంశం గురించి చెప్పుకొచ్చారు. నిన్న దేవాలయాల పై జరుగుతున్న ఘటనల్లో ఎలాంటి కుట్ర కోణం లేదని, 44 ముఖ్య కేసుల్లో, 29 తెల్చేసాం అని చెప్పుకొచ్చారు. వీటిల్లో పిచ్చి వాళ్ళు, జంతువులు, మూడ నమ్మకం ఉన్న వాళ్ళు, కావాలని చేసిన వాళ్ళు, మందు బాబులు, స్థల వివాదం ఉన్న వాళ్ళు ఇలా ఉన్నారని చెప్పుకొచ్చారు. కొన్ని సంఘటనల్లో ఎప్పుడో జరిగినవి, ఇప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అయితే నిన్నటితో ఈ అంశం పై ఎలాంటి కుట్ర కోణం లేదు అనే విషయం మీడియాలో వచ్చింది. అయితే ఈ రోజు డీజీపీ గారు మళ్ళీ ఈ రోజు ఇదే అంశం పై ప్రెస్ ముందుకు వచ్చారు. 9 సంఘటనల్లో రాజకీయ పార్టీల ప్రమేయం ఉన్నట్టు చెప్పారు. ఇందులో 17 మంది టిడిపి వాళ్ళు ఉన్నారని, 4 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారని, వారిలో 15 మందిని అరెస్ట్ చేయగా, ఆరుగురు పరారీలో ఉన్నారని చెప్పారు.
అయితే ఇంత వరకు బాగానే ఉంది. నిజంగా ఆలయాల ధ్వంసం వెనుక, టిడిపి, బీజేపీ, ఏ పార్టీ వాళ్ళ కుట్ర ఉన్న శిక్షించి వాళ్ళకు తగిన శాస్తి చేయాల్సిందే. అయితే డీజీపే గారి ప్రెస్ మీట్ తరువాత, దీనికి సంబందించిన పూర్తి వివరాలు ఇచ్చారు. ఇందులో ఎక్కడా టిడిపి వాళ్ళు విగ్రహాలు ధ్వంసం చేసినట్టు లేదు. ఎప్పుడో ధ్వంసం అయితే, వేరే కారణాల వల్ల ధ్వంసం అయితే, టిడిపికి చెందిన వాళ్ళు, అది ఇప్పుడు జరిగింది అంటూ, సోషల్ మీడియాలో ఫాల్స్ ప్రచారం చేసారు అనేది, కొన్ని కేసులు వివరాలు. ఇంకోటి రెండు వర్గాల మధ్య గొడవ. ఇలా ఎక్కడా టిడిపి వాళ్ళు కావాలని విగ్రహాలు ధ్వంసం చేసినట్టు లేదు. అయితే, డీజీపీ గారి ప్రెస్ నోట్ ఒకలా ఉంటే, వైసీపీ మాత్రం తప్పుడు ప్రచారం చేస్తుంది అంటూ, తెలుగుదేశం నేతలు విరుచుకు పడుతున్నారు. సోషల్ మీడియాలో ఘటన గురించి పోస్ట్ చేస్తే, అది విగ్రహాల ధ్వంసం కేసు ఎలా అవుతుంది అంటూ టిడిపి ప్రశ్నిస్తుంది. నిన్న ఇవేమీ చెప్పకుండా, ఏమి లేదు అని చెప్పిన డీజీపీ, ఈ రోజు ఎందుకు ఇలా చెప్పారు అంటూ, టిడిపి ప్రశ్నిస్తుంది. మొత్తానికి, 24 గంటల్లో డీజీపీ గారు పెట్టిన ప్రెస్ మీట్ తో, మళ్ళీ రాజకీయ విమర్శలు మొదలయ్యాయి.