ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధిక కష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. విభజన తరువాత చంద్రబాబు ప్రభుత్వం, 5 ఏళ్ళలో లక్షా 25 వేల కోట్లు అప్పు చేస్తూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 19 నెలల్లోనే ఆ రికార్డు దాటేసింది. పోనీ అప్పు తెచ్చి ఆదాయం పెంచుతున్నారా అంటే, అప్పు తెచ్చి పంచి పెడుతున్నారు. పరుగులు పెట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు, సాగుతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో రోడ్డుల పరిస్థితి చూస్తే, ప్రభుత్వం ఎలా ఖర్చు చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ ఎలా ఉన్నా, ఉద్యోగస్తులకు, పదవీ విరమణ చేసిన వారికి సరైన సమయానికి జీతాలు, పెన్షన్లు వస్తున్నాయా అంటే, ఒక్కో నెల ఒక్కో విధంగా, వస్తున్నాయి. జీతాలు ఆలస్యం అవుతున్నాట్టు ప్రతి నెల ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. దానికి కారణం సాంకేతిక సమస్యలు అని ప్రతి సారి చెప్పి తప్పించుకుంటున్నారు. ఇక రిటైర్డ్ అయిన ఉద్యోగుల సంగతి అయితే చెప్పే పనే లేదు. చాలా మందికి రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందటం లేదు. పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు, ఇల్లు కట్టుకోవటానికి, ఇలా అనేక అవసరాల కోసం ఆ డబ్బులు వాడుకుందాం అనుకునే వారికి నిరాస ఎదురు అవుతుంది. ఈ రోజు ప్రముఖ పత్రికలో వచ్చిన కధనం ప్రకారం, ఇలాంటి బిల్లులు దాదాపుగా వెయ్యి కోట్లు పెండింగ్ లో ఉన్నాయి.

bopparaju 20022021 1

పీఎఫ్ డబ్బులు ప్రభుత్వం నుంచి రాకపోవటంతో, మళ్ళీ బయట అప్పులు తెచ్చుకుని, ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఇక పెన్షన్ తీసుకునే వారి కష్టాలు ఇలాగే ఉన్నాయి. ప్రతి నెలా మొదటి తారీఖున వచ్చే పెన్షన్, ఇప్పుడు రెండు వారాలకు పడుతుందని వాపోతున్నారు. తాజాగా కొంత మందికి జనవరి నెల పెన్షన్, ఫిబ్రవరి నెలలో అందింది. అయితే అసలు పెన్షన్ ఎప్పుడు వస్తుందో, ఏమిటో చెప్పే వారు లేరని, పెన్షన్ దారులు వాపోతున్నారు. ఈ సమస్యలు అన్నిటి పై చర్చించటానికి, నిన్న చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ సలహాదారు సజ్జల సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో తమ సమస్యల గురించి పరిష్కారం చూడాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు, వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు,ఒకరి పై ఒకరు నిందలు వేసుకోవటంతోనే సరిపోయింది. వారికి సర్ది చెప్పిన సజ్జల, యధావిధగా సాంకేతిక సమస్యలు ఉన్నాయని, తొందర్లోనే అన్నీ సర్దుకుంటాయని చెప్పి పంపించారు. ఆ సమస్యను పరిష్కరించి, మళ్ళీ ఈ ఇబ్బందులు లేకుండా చుస్తామని చెప్పి వెళ్ళిపోయారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read