చంద్రగిరి మండలంలోని తొండవాడగ్రామంలో పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదాన్ని ఓటర్లకు స్లిప్పులతో పాటు పంచడం, దైవానికి నైవేద్యంగా పెట్టే స్వామివారి ప్రసాదాన్ని ఆ విధంగా అపవిత్రం చేయడంపై తిరుమలతిరుపతి దేవస్థానం వారు, ప్రభుత్వ పెద్దలు ఎందుకు మాట్లాడరని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ నిలదీశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రసన్నమైన, నిర్మలమైన స్వామివారికి ప్రతిరూపమే ప్రసాదమని, అటువంటి ప్రసాదాన్ని తినుబండారాల మాదిరి, బహిరంగంగా అపవిత్రంగా పంచడం ఎంతమాత్రం క్షమార్హం కాద న్నారు. తిరుమలలో ప్రసాదం తయారీ కేంద్రాన్ని పోటు అంటారని, ఆ ప్రసాదం తయారయ్యే విధానాన్ని వేంకటేశ్వరస్వామివారి తల్లి గారైన వకుళమాత పరిశీలిస్తుంటారని ప్రతి హిందువు విశ్వసిస్తుం టారన్నారు. అటువంటి ప్రాశస్త్యమైన ప్రసాదం లక్షలకొద్దీ లడ్డూల రూపంలో బయటకు ఎలా వస్తుందో ప్రభుత్వం సమాధానం చెప్పాల న్నారు. తిరుమల ప్రసాదాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటూ, ఈ ప్రభుత్వం ఒకరకంగా హిందూమతంపైదాడికి పాల్పడిందన్నా రు. తిరుమలకొండపై గతంలో అన్యమతప్రచారం చేసినవారు, శ్రీవారికి చెందిన నగలనుతాకట్టు పెట్టాలని చూశారని, తిరుమల కొండపై ఉన్నఆస్తులను కూడా విక్రయించాలని చూశారన్నారు.
అన్యమతస్తుడైనవ్యక్తికి ఎస్వీబీసీఛైర్మన్ బాధ్యతలు అప్పగిస్తే, అతనేంచేశాడో అందరికీ తెలిసిందేనన్నారు. శ్రీవారి ప్రసాదంపై భక్తులకు, హిందూమతం వారికి ఉండే పవిత్రభావాన్ని మంట గలపాలనే ఇటువంటి దుశ్చర్యలకు పాలకులు పాల్పడు తున్నారన్నారు. ఒకపక్కదేవాలయాలపై దాడులు జరుగుతుంటే, మరోపక్కనేనే నిజమైన హిందువునంటూ ముఖ్యమంత్రి అంతర్వేది లో రథాన్నిప్రారంభించాడన్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూల పంపిణీపై ప్రభుత్వం తక్షణమే విచారణకకు ఆదేశించాలని బుచ్చిరామ్ ప్రసాద్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఈవ్యవహారంపై దృష్టిసారించి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కోట్ల మంది మనోభావాలు దెబ్బ తీసి 24 గంటలు అయినా, ప్రభుత్వం నుంచి ఆక్షన్ ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించిక పొతే, కనీసం ఎలక్షన్ కమిషన్ అయినా, ఈ విషయం పై సీరియస్ గా స్పందించాలని కోరారు.