ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసి, దాదాపుగా 77 రోజులు పాటు కస్టడీలో ఉంచిన సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడు ఏదో కంపెనీకి సిఫారుసు చేసారు అంటూ, అభియోగాలు మోపిన ఏసిబి, ఆయన్ను అరెస్ట్ చేసింది. అయితే అచ్చెన్నాయుడు బెయిల్ కోసం కింద కోర్టులో, అలాగే హైకోర్టులో పిటీషన్ వేయగా, రెండు చోట్లా తిరస్కరించబడింది. మళ్ళీ తరువాత హైకోర్టుకు వెళ్లి, 77 రోజులు అయినా అభియోగాల పై ఎలాంటి ఆధారాలు చూపలేదని, సిఫారసు లేఖలు అనేవి మాములుగా జరిగే ప్రక్రియ అని, పక్క రాష్ట్రంలో జరిగినట్టే ఇవ్వమని చెప్పారని, దీనిలో ఎలాంటి అవినీతి లేదని, ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి కూడా మేము ఎస్టాబ్లిష్ చెయ్యలేదని, అడ్వకేట్ జనరల్ కూడా కోర్టుకు తెలిపిన విషయాన్ని, అచ్చెన్నాయుడు తరుపు లాయర్లు కోర్టుకు చెప్పటంతో, కోర్టు కూడా ఇందుకు ఏకీభావిస్తూ, ఇప్పటికే 77 రోజులు సమయం ఇచ్చామని, అంతకు ముందుకు కూడా ప్రాధమిక విచారణ జరిగిందని, ఈ కోర్టులో ఒకసారి బెయిల్ పిటీషన్ కూడా తిరస్కరించాం అని, అయినా ఇప్పటికీ అచ్చెన్నాయుడు డబ్బు తీసుకున్నారనే ఆధారాలు ఇవ్వలేదు కాబట్టి, ఏ3 దొరికే దాకా, ఆయనకు బెయిల్ ఇవ్వకూడదు అనేది కరెక్ట్ కాదు అంటూ, గత వారం బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.

achem 03092020 2

అచ్చెన్నాయుడుకు అప్పటికే కరోనా సోకి రెండు వారలు అవ్వటం, ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండటంతో, ఆయన నాలుగు రోజులు తరువాత డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆయన ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడలేదు. ఆయన ఈ కేసు పై ఎలా స్పందిస్తారా అని అనుకున్న టైంలో, నిన్న ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. తానూ ఏ తప్పు చెయ్యలేదు అని, ప్రభుత్వం చేస్తున్న తప్పులు నేను ప్రశ్నించటమే తప్పు అయితే, మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, నేను నిలదీస్తూనే ఉంటానని అన్నారు. మీ అవినీతిని నేను ప్రశ్నించటం నేరం అయితే, మీరు ఎన్ని అక్రమ కేసులు నా పై పెట్టినా నేను మీ అవినీతి ప్రశ్నిస్తూనే ఉంటాను అని అచ్చెన్నాయుడు అన్నారు. నిజాయితీగా ఉంటానని, అదే నా ధైర్యం అని అన్నారు. తన పై అక్రమ కేసు పెట్టారని, ప్రజలందరూ గుర్తించారని, తాను అనార్యోగం నుంచి కోలుకోవాలని ప్రజలు ప్రార్ధించారని అచ్చెన్నాయుడు అన్నారు. ఇక నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా, విజయవాడలోని అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్లి, ఆయన్ను పరామర్శించి, కుటుంబ సభ్యులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read