ఎప్పటి లాగా, ఈ సారి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండి పట్టుదలతో ముందుకు వెళ్తుంది. హైకోర్టు కాదు అని చెప్తున్నా, ఇప్పుడు సుప్రీం కోర్టులో తేల్చుకుంటాం అంటూ, మరోసారి సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది ప్రభుత్వం. గతంలో నిమ్మగడ్డ రమేష్ విషయం, పంచాయతీ భావనలకు పార్టీ రంగులు విషయం, అమరావతి విషయం, ఇలా అనేక అంశాల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులని సుప్రీం కోర్టులో సవాల్ చెయ్యగా, ప్రతి సారి అక్కడ కూడా చుక్కు ఎదురు అవుతుంది. ఇవన్నీ చట్టబద్దమైన అంశాలు కాబట్టి, ఎక్కడైనా ఒకే తీర్పు వచ్చే అవకాసం ఉండటంతో, కింద కోర్టు, పై కోర్టులో కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగులుతుంది. ఇప్పుడు తాజగా డాక్టర్ రమేష్ కేసు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. విజయవాడలో ఉన్న ఒక డాక్టర్ ని ఎలా అయినా బాధ్యుడుని చెయ్యలనే ఆలోచనలో, ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక ఊరిలో ఉన్న ఒక డాక్టర్ పై, సుప్రీం కోర్టు వరకు వెళ్ళటం అందరినీ ఆశ్చర్యానికి కలిగిస్తుంది. స్వర్ణా ప్యాలస్ ఘటన తరువాత, డాక్టర్ రమేష్ ని టార్గెట్ చేస్తూ, చర్చ అంతా డాక్టర్ రమేష్ పైనే తిరిగేలా చేసారు. ఏకంగా ప్రజలు ప్రాణాలు కాపాడే డాక్టర్ కి కులం అంట గట్టారు. ఇక మరింత ముందుకు వెళ్లి, డాక్టర్ రమేష్ ఆచూకీ తెలిపితే లక్ష రూపాయల బహుమతి ప్రకటించారు.

sc 04092020 2

ఇలా ఒక డాక్టర్ పై ప్రభుత్వ స్థాయిలో టార్గెట్ చేసారు. అయితే ఘటన జరిగిన హోటల్ యాజమాన్యం పై కాకుండా, వైద్యం చేసిన డాక్టర్ రమేష్ ని టార్గెట్ చేస్తున్నారు అనే అభిప్రాయంతో పాటు, అసలు అక్కడ అనుమతి ఇచ్చిన అధికారులు ఎవరు అనే చర్చ కూడా మొదలైంది. అయితే ఈ కేసు పై డాక్టర్ రమేష్ హైకోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా హైకోర్టు ఎఫ్ఐఆర్ పై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు, స్టే విధిస్తూ, అసలు ఈ ఘటనకు బాధ్యులు ఎవరో తేల్చాలని కోరింది. ఆ హోటల్ లో ఇంతకు ముందు ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్ నిర్వహణ చేసింది కదా ? అసలు అక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చారు ? కలెక్టర్ బాధ్యత ఏమిటి ? సబ్ కలెక్టర్ బాధ్యత ఏమిటి ?డీఎం అండ్ హెచ్‌వో ఏమి చేస్తున్నారు, వీరిని ఎందుకు బాధ్యులని చెయ్యకూడదు అనే ప్రాధమిక ప్రశ్నలు కోర్టు అడిగింది. అనుమతులు ఇచ్చిన అధికారులని హైకోర్టు ప్రశ్నించింది. అయితే హైకోర్టు ఎఫ్ఐఆర్ పై ఇచ్చిన స్టే పై, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సుప్రీం కోర్టు తలుపు తట్టింది. అధికారులని బాధ్యులని చేరుస్తూ, రమేష్, హోటల్ యాజమాన్యం పై కూడా చర్యలు తీసుకుంటే అయిపోయే దానికి, సుప్రీం కోర్టుకు వెళ్ళటం పై, ఇప్పుడు చర్చ జరుగుతుంది. ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభిస్తుందా ? లేక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులని సమర్ధిస్తారా అనేది చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read