ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నిత్యం ఎదో ఒక ఘటనతో ప్రతిపక్ష నాయకులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా, ప్రభుత్వం పై గట్టిగా మాట్లాడుతున్నా వారు, టార్గెట్ అవుతున్నారు. నిన్న సబ్బం హరి, 5 అడుగులు ఆక్రమించుకున్నారు అంటూ, ఆయన ఇంటి ప్రహరీ గోడ పడేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం నిన్న అంతా హాట్ టాపిక్ గా ఉంటూ ఉండగానే, ఈ రోజు తెలుగుదేశం నాయకుడు , అధికార ప్రతినిధి కొమ్మా రెడ్డి పట్టాభి రాం కారు ఈ రోజు ఉదయం గుర్తు తెలియిన దుండగులు ధ్వంసం చేసారు. ఆయన ఇంటి ముందు పెట్టిన కారు ముందు భాగం, వెనుక భాగం పెద్ద పెద్ద రాళ్ళతో ధ్వంసం చేసారు. ఆయన కారు ముందు, వెనుక అద్దం పూర్తిగా దెబ్బ తింది. ఇక పోతే ఈ దాడి పై స్పందించిన పట్టాభి, తానూ రాత్రి 10.30 ప్రాంతంలో ఇంటికి వచ్చి, రాత్రి 12 గంటల ప్రాంతంలో పడుకున్నాని, ఈ ఘటన అర్ధరాత్రి జరిగి ఉండవచ్చు అని అనుమానం వ్యక్తం చేసారు. ఉదయం ఈ ఘటన చూసి షాక్ అయ్యానని అన్నారు.

ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపిస్తున్న నాకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన బహుమానం ఇది అని అన్నారు. తాను కాని, తెలుగుదేశం నేతలు ఎవరూ కానీ, ఇలాంటి దాడులకు భయపడం అని, మరింత రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని అన్నారు. ఈ ప్రాంతం హైసెక్యూరిటీ జోన్ ఉండే ప్రాంతం అని, పికెట్ ఉంటుందని, హైకోర్ట్ జడ్జిగారి ఇల్లు పక్కనే ఉందని, అయినా ధైర్యంగా వచ్చి, ఈ పని చేసారు అంటే, రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి అద్దం పడుతుందని అన్నారు. సిసి టీవీ ఫూటేజ్ ఆధారంగా, పోలీసులు దర్యాప్తు చెయ్యాలని కోరారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు, ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, పట్టాభి గారికి ఫోన్ చేసి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇక ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీం రంగంలోకి దిగింది. త్వరలోనే ఘటన వెనుక ఉన్న వారిని పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు. కారు ధ్వంసం అయిన తీరు, ఈ వీడియోలో చూడవచ్చు. https://youtu.be/cGrxwcMLWJY

Advertisements

Advertisements

Latest Articles

Most Read