రాజకీయాల్లో అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగటం సహజమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా, అధికార ప్రతిపక్షాల మాధ్య మాటల యుద్ధం నడుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టి, నేటికి ఏడాది అయ్యింది. ఈ సందర్భంలో, వాళ్ళను చప్పట్లు కొట్టి అభినందించాలి అంటూ, రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇచ్చింది. వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారని, అందుకే మేము ఈ పిలుపు ఇచ్చాం అని చెప్పింది. అయితే దేశంలో కోవిడ్ పై పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు చప్పట్లు కొడితే, ఇక్కడ వాలంటీర్లకు చప్పట్లు కొట్టటం పై ఆసక్తికర చర్చ జరుగుతుంది. వాలంటీర్లు చేసే పని, గతంలో రెవిన్యూ డిపార్టుమెంటు చేసేది. ఇక పొతే, పెన్షన్లు ఇంటికి తెచ్చ ఇస్తున్నారు. ఇది ఒక్కటే పెద్దగా చెప్పుకునే అంశం. అయితే వాలంటీర్ వ్యవస్థ పై అనేక ఆరోపణలు, కేసులు కూడా వచ్చాయి. మహిళల పై లైంగిక వేధింపులు దగ్గర నుంచి, నాటు సారా, అక్రమ మద్యం, దొంగతనాలు, హత్యలు, ఇలా అనేక ఆరోపణలు వచ్చాయి.
మొదటి నుంచి ఈ వ్యవస్థను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుంది. యువతకు ఉద్యోగాలు అని చెప్పి, 5 వేలు ఇచ్చి, ఇవా ప్రభుత్వం చేపించేది, వాలంటీర్ వ్యవస్థ వల్ల నష్టాలు తప్ప లాభం లేదు, రెవిన్యూ వ్యవస్థనే పటిష్టం చెయ్యాలని వాపోతుంది. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం ఇచ్చిన చప్పట్ల పిలుపుకు, టిడిపి నిరసన తెలిపింది. చప్పట్లు కాదు, చెప్పుతో కొట్టాలి అంటూ, తెలుగు యువత నిరసన తెలిపింది. వాలంటీర్లు చేసిన వేధింపులు, దొంగ తనాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాల వార్తా పత్రికలు ప్రదర్శిస్తూ, వాటిని చెప్పుతో కొడుతూ, ఇలాంటి వారికి చప్పట్లు కొట్టాలా ? వీళ్ళని చెప్పుతో కొట్టాలి అంటూ నిరసన తెలియ చేసారు. విజయవాడ పార్టీ ఆఫీస్ లో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. మహిళలు వేదిస్తున్నందుకు, అత్యాచారాలు చేస్తున్నందుకు, దొంగతనాలు చేస్తున్నందుకు, ఎర్రచందనం దోపిడీ చేస్తున్నందుకు వీళ్ళకు చప్పట్లు కొట్టాలా అంటూ, నిరసన తెలియ చేసారు. ఆ నిరసన ఇక్కడ చూడవచ్చు https://youtu.be/kkwbJ9ChExM