గన్నవరం వైసీపీలో రచ్చ తారాయ స్థాయికి చేరింది. పార్టీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు, డీసీసీబీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావ్ వంశీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సీఎం వద్దే తేల్చుకొనేందుకు వీరు సిద్దం అవుతున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం బాపులపాడు మండలం కాకులపాడు గ్రామంలో రైతు భరోసా, ఆరోగ్య కేంద్రాలకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ శంకుస్థాపన చేశారు. పర్యటనలో భాగంగా ఈ రెండు గ్రామాలతో పాటు కే.సీతారామపురం, పెరికీడు గ్రామాల్లో బీఆర్ అంబేద్కర్ , మహత్మ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాకులపాడు గ్రామంలో శంకుస్థాపన చేసే విషయంలో తాము ముందు చేస్తామంటూ , మేమే ముందు చేయాలంటూ రెండు వర్గాలు గొడవపడ్డారు. ఎమ్మెల్యే వల్లభనేని మోహన్ వారికి సర్ది చెప్పి అయన ఒక్కరే శంకుస్థాపన చేశారు. అనంతరం సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామసభలో ఎమ్మెల్యే వంశీ మోహన్ పాల్గొన్నారు. కాకులపాడు పక్క గ్రామంలో దంటగుంట్ల ఎమ్మెల్యే వంశీ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చింపేశారు. ఎమ్మెల్యే వంశీ, దుట్టా వర్గీయులు ప్రతి విషయంలోనూ ఢీ అంటే ఢీ అన్నారు.

కాకుమాను సచివాలయ నిర్మాణానికి దుటా వర్గీయులు గ్లాసులోని పాలను తీసుకుని శంకుస్థాపన స్తలంలో పోయడానికి ప్రయత్నిస్తుండగా వంశీ అనుచరుడు ఒకరు ఆ గ్లాసును చేతితో ఎగరగొట్టేశారు. ఎమ్మెల్యేను కాదని మీరెట్లా శంకుస్తాపన చేస్తారంటూ నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలయింది. ఎవరిని వారించినా కూడా వెనుకకు తగ్గలేదు. ఇరువర్గాల మధ్య తోపులాటతో మొదలైన గొడవ చొక్కాలు పట్టుకొనే వరకు వెళ్ళింది. పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. దీనిపై దుట్టా వర్గీయుడు తమపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఇలా నడుస్తూ ఉండగానే, నిన్న యార్లగడ్డ వెంకట్రావు పుట్టిన రోజు కావటంతో, మళ్ళీ వివాదం రేగింది. నున్న గ్రామానికి వచ్చిన యార్లగడ్డను పోలీసులు వారించారు. కారు నుంచి దిగి నడుచుకుంటూ నున్న వచ్చారు. పుట్టిన రోజు వేడుకల్లో పాల్గున్న తరువాత, వంశీ పై అనేక వ్యాఖ్యలు చేసారు. అద్దె నాయకుడు అంటూ విరుచుకు పడ్డారు. ఎమ్మెల్యే, ఒక మంత్రి కలిసి, పోలీసులు పై ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టారని అన్నారు. అయితే యార్లగడ్డ వంశీ పై వ్యాఖ్యలు చేయటం మామూలే అయినా, ఆ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ చూడవచ్చు https://youtu.be/MKFY4hCYNHo

Advertisements

Advertisements

Latest Articles

Most Read