ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజు చీరాల దళిత యువకుడు కిరణ్ మరణించిన తీరు, సందేహాల పై వేసిన కేసు పై, విచారణ జరిగింది. కిరణ్ మాస్కు పెట్టుకోలేదని, పోలీసులు కొట్టటంతో అతను చనిపోయారు. అయితే ఈ కేసు పై తమకు అనుమానాలు ఉన్నాయని, మాజీ ఎంపీ హర్ష కుమార్, హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసారు. ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు. హర్ష కుమార్ తరుపున , న్యాయవాది శ్రవణ్ కుమార్ ఈ కేసుని ఈ రోజు హైకోర్టులో వాదించారు. అయితే ఈ విచారణ సందర్భంగా, హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వ తరుపు న్యాయవాది మాట్లాడుతూ, ఈ కేసుని కొట్టేయాలని కోరారు. ఇప్పటికే ఈ కేసు విచారణ పట్ల, కిరణ్ తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేసారని, వాళ్ళు ఎక్కడా అభ్యంతరం చెప్పలేదని, కోర్టుకు తెలిపారు. అందకే కేసుని కొట్టేయాలని కోర్టుని కోరారు. అయితే ఈ వ్యాఖ్యల పై హైకోర్టు స్పందిస్తూ, కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.

ఎవరినైనా మీరు సంతృప్తి పరుస్తారు, మీ ప్రభుత్వం ఎవరిని అయినా సంతృప్తి పరుస్తుంది అంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ కేసుని సిబిఐకి ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని కోరింది. తల్లిదండ్రులు సంతృప్తి చెందినంత మాత్రాన ఈ కేసు మూసేయలేం, ఈ కేసుని సిబిఐకి ఇవ్వగల అర్హత గల కేసుగా మేము భావిస్తున్నాం అంటూ, కౌంటర్ దాఖలు చెయ్యటానికి రెండు వారాలు సమయం కోరారు కాబట్టి, రెండు వారల సమయం ఇస్తున్నాం అని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ సందర్భంగా, హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. మాస్కు పెట్టుకోలేదని కొట్టి చంపటం చాలా తీవ్రమైన సమస్య, ఇండిపెండెంట్ బాడీ చేత విచారణ చేపించే అర్హత ఉంది అంటూ, అలాగే మీ ప్రభుత్వం ఎవరిని అయినా సంతృప్తి పరుస్తుంది అంటూ చేసిన వ్యాఖ్యలు, కీలకంగా మారాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read