ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వైసీపీ, బీజేపీ కలిసి రహస్య మిత్రులుగా ఉన్న సంగతి రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా చెప్తారు. ముఖ్యంగా బీజేపే లోని ఒక వర్గం అయితే, వైసీపీ నేతలు, బీజేపీని ఎంత టార్గెట్ చేసినా, వారు సైలెంట్ గానే ఉంటారు. అదే చంద్రబాబు మీదకు అయితే మాత్రం, సంబంధం లేకపోయినా లాగి, రచ్చ చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా వైసీపీ నేతలు కావాలని రెచ్చగొట్టే తీరు, ఆసక్తిగా మారింది. వైసీపీ ఎంత రచ్చెగొట్టిన, బీజేపీ మాత్రం చూసి చూడనట్టు, పై పైన విమర్శలు చేసి వదిలేస్తున్న తీరు కూడా ఆశ్చర్యకరంగా మారింది. గతంలో కన్నా లక్ష్మీనారయణ ఉండగా, ఇలాంటి సందర్భాలు వస్తే, గట్టిగా బదులు ఇచ్చే వారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏపి బీజేపీ నాయకత్వం మాత్రం, పెద్దగా పట్టించుకోవటం లేదని, అభిప్రాయం ఉంది. మొన్న కొడాలి నాని, ప్రధాని మోడీ, ఉత్తర ప్రదేశ్ సియం యోగి, భార్యల పై వ్యాఖ్యలు చేసినా, బీజేపీలో అనుకున్న స్థాయిలో వైసీపీ విమర్శలను తిప్పికొట్టలేదు.

విమర్శించిన కొంత మంది నాయకులు మాత్రం, చంద్రబాబుని లాగి విమర్శలు చెయ్యటం గమనార్హం. ఇప్పుడు తాజాగా విజయసాయి చేసిన వ్యాఖ్యలు కూడా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. కొత్తగా ప్రకటించిన బీజేపీ కార్యవర్గంలో, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా దగ్గుబాటి పురంధేశ్వరి నియమించబడ్డారు. అయితే తమకు అనుకూలమైన వారు ఆ పదవిలో లేరానో ఏమిటో కాని, విజయసాయి రెడ్డి ఉక్రోషం బయట పడింది. పురంధేశ్వరి ఈ రోజు ఈనాడుకి అమరావతి పై ఇచ్చిన ఇంటర్వ్యూ ని ఉదాహరిస్తూ, విజయసాయి రెడ్డి పురంధేశ్వరి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆమె చెప్పిన అభిప్రాయాలతో, ఆమె జాతీయ నాయకురాలు కాదని, జాతి నాయకురాలని విజయసాయి రెడ్డి కులం ఆపాదించి వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యల పై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. మరి కొంత మంది నేతలు మాత్రం, జగన్ ని దెబ్బ తియ్యటానికి, చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని, విజయసాయి రెడ్డి ఇలా అన్నారు అంటూ, వైసీపీ పై తమ భక్తీ చూపించారు. మొత్తానికి అసలు వైసీపీ, బీజేపీ మధ్య ఏమి జరుగుతుందో అర్ధం కాక సామాన్య ప్రజలు మాత్రం కన్ఫ్యూషన్ లో ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read