చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేకపోయినా, ఆయనకు పదవి పోయి 16 నెలలు అయినా, ఆయన ముందు చూపుతో చేసిన పనితో, ఇప్పుడు ప్రజలకు మేలు జరిగింది. ఇలాంటివి చూసినప్పుడే, ఒక సామెతకు గుర్తుకు వస్తుంది. రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నిక కోసం ఆలోచిస్తాడు, దార్శనికుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తాడు అని. రాజకీయ సమరంలో చంద్రబాబు ఓడిపోయినా, ఆయన పనులు మాత్రం, ప్రజలకు ఉపయోగ పడుతూనే ఉన్నాయి. అమరావతిని రాజధానిగా చేసిన క్రమంలో, ముందుగా వచ్చిన అతి పెద్ద విమర్శ, వరదలు వస్తే, కొండవీటి వాగు పొంగి, అమరావతి మొత్తం మునిగిపోతుందని. అయితే ఈ సమస్య అధిగమించి, విమర్శలకు శాశ్వతంగా చెక్ పెట్టేలా, అమరావతికి రక్షణ కవచంగా, కొండవీటి వాగు నిర్మాణం చేసారు చంద్రబాబు. కృష్ణా నదికి పై నుంచి వరద వచ్చినప్పుడు, కొండవీటి వాగు ఎత్తిపోతల ఉపయోగం ఉండదు. ఎందుకుంటే, బ్యారేజి నుంచి కిందకు వదిలేస్తారు కాబట్టి. అయితే, ఒకేసారి కొండవీటి వాగుకి, కృష్ణా నదికి వరద వస్తే అప్పుడు ఇబ్బంది.
కొండవీటి వాగు నిర్మాణం చేసిన తరువాత, ఇలాంటి పరిస్థితి మొదటి సారి వచ్చింది. కొండవీటి వాగుకి, కృష్ణ నదికి ఒకే సారి వరద వచ్చి, కొండవీటి వాగు వెనక్కు తన్ని, కొంత మేర పొలాల్లోకి నీరు వెళ్ళింది. దీంతో వెంటనే అధికారాలు కొండవీటి వాగు ఎత్తిపోతల ఆన్ చేసారు. ముందుగా అంచనా వేసి ఉంటే, ఈ మాత్రం కూడా వరద పొలాల్లోకి వెళ్ళేది కాదని రైతులు అంటున్నారు. ప్రస్తుతం 5 మోటార్లు మాత్రమే వదిలారని, మొత్తం 16 మోటార్లు ఆన్ చేసి, ఇప్పుడు ఉన్న వరద మొత్తం కృష్ణలోకి ఎత్తి పోయవచ్చని, రైతులు అంటున్నారు. ఈ సందర్భంగా రైతులు చంద్రబాబు ముందు చూపుని మెచ్చుకుంటున్నారు. తమకు కృష్ణకు 6 లక్షల క్యూసెక్కుల వరద వస్తే, కొన్ని పొలాలు ముంపుకు గురయ్యేది అని, ఇప్పుడు కొండవీటి వాగుతో, ఆ ముప్పు తప్పిందని, ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న సమస్యకు పరిష్కారం లభించిందని అంటున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ఇటీవల కురసిన వర్షాలతో ముంబై, నుంచి హైదరాబాద్ వరకు అనేక నగరాలు మునిగిపోయాయి కానీ, ఎక్కడా అమరావతి మునగలేదని, ఇప్పటికైనా ఆ విష ప్రచారం ఆపాలని కోరుతున్నారు. కొండవీటి వాగు ఎత్తిపోతల సుందర దృశ్యం, ఈ వీడియోలో చూడవచ్చు, https://youtu.be/3mzBdo3w7ws