ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంలో, ఇచ్చిన హామీల్లో ఏది ఇప్పటి వరకు సరిగ్గా అమలు పరచలేదు. పాక్షికంగా చేసినవి కూడా, అనుమానంగా ఉన్నాయి. విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని విభజన హామీల్లో పెట్టారు. 5 ఏళ్ళు తెలుగుదేశం పోరాడగా, పోయిన 2019 ఎన్నికల ముందు, రైల్వే జోన్ ప్రకటించారు. అయితే ఇది కూడా అసంపూర్ణంగానే జరిగింది. ఏదో ఒకటి వస్తుంది అనుకుంటే, ఇప్పుడు దాని పై కూడా నీలి నీడలు అలుము కున్నాయి. కేంద్రం రైల్వే మంత్రి పియూష్ గోయల్, పార్లమెంట్ లో మాట్లాడుతూ, రైల్వే జోన్లతో పాటు, డివిజన్ల సంఖ్య కూడా తగ్గించే అవకాశం ఉంది అంటూ పార్లమెంట్ లో చేసిన ప్రకటనతో, ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ చర్చనీయాంశం అయ్యింది. ఇప్పటి వరకు జరిగిన రైల్వే జోన్ ల పై పరిశీలన చేస్తున్నామని, ఏది లాభం, ఏది కాదు, ఇలా వివిధ అంశాలు పరిశీలన చేస్తున్నట్టు చెప్పారు. అయితే దేశంలో వివిధ రైల్వే జోన్లు, డివిజన్ల పై సమీక్ష చేస్తామని చెప్పిన కేంద్ర మంత్రి, విశాఖ రైల్వే జోన్ పై మాత్రం ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ, ఇప్పటికీ విశాఖ జోన్ ఏర్పాటు కాకపోవటంతో అనుమానాలు కలుగుతున్నాయి.

విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని కేంద్రం ప్రకటించి, 18 నెలలు గడిచినా, ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. విశాఖ రైల్వే జోన్ డీపీఆర్ ను కూడా అధికారులు కేంద్రానికి ఇచ్చి, 15 నెలలు అయ్యింది. అయినా పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. ఇంకా డీపీఆర్ ను కేంద్రం పరిశీలిస్తూనే ఉందో ఏమో కానీ, అటు వైపు నుంచి ఎలాంటి స్పందన అయితే లేదు. నెలలు గడుస్తున్నా కేంద్రం వైపు నుంచి స్పందన లేకపోవటంతో, ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. మనకు నిజంగానే జోన్ వస్తుందా లేదా అనే చర్చ మొదలైన సందర్భంలో, ఇప్పుడు కేంద్ర మంత్రి చేసిన ప్రకటన చూస్తూ, మరింత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రం నుంచి కూడా ఎలాంటి స్పష్టమైన హామీ, రైల్వే జోన్ పై రాక పోవటంతో, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లో కూడా ఈ అంశం లేవనెత్తారు. అయితే వాల్తేరు డివిజిన్ , రైల్వే జోన్ లో పెడతారా లేదా అనే చర్చ సాగుతున్న సమయంలో, అసలు రైల్వే జోన్ అనేది వస్తుందా రాదా అనే సందేహం ఇప్పుడు, వ్యకం అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read