ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. ఇదేదో సిబిఐ కేసు, ఈడీ కేసు కాదు, ఆయన చట్టాలను గౌరవించటం లేదు అంటూ, పిటీషన్ దాఖలు అయ్యింది. ఇక వివరాల్లోకి వెళ్తే, పోయిన వారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల డిక్లరేషన్ అంశం, రాష్ట్రాన్ని కుదిపేసింది. వరుసగా దేవాలయాల పై జరుగుతున్న దాడులు నేపధ్యంలో, జగన్ మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళినా, డిక్లరేషన్ ఇవ్వరు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేసాయి. ఇదే సందర్భంలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు, జగన్ మోహన్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానించటం, అలాగే జగన్ మోహన్ రెడ్డి దానికి ఒప్పుకోవటంతో, వివాదం పెద్దది అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి క్రీస్టియన్ కాబట్టి, ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఆచారాలు ప్రకారం, అలాగే చట్టం ప్రకారం, తనకు శ్రీవారు అంటే నమ్మకం ఉందని, డిక్లరేషన్ పై సంతకం చేసి వెళ్ళాల్సిందే అంటూ ప్రతిపక్షాలు, హిందూ సంఘాలు నిరసనలు చేసాయి. ఇదే సందర్భంలో మంత్రి కొడాలి నాని, మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు, మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి.

అయితే ఇన్ని నిరసనలు, విమర్శలు, ప్రతి విమర్శలు తరువాత కూడా, జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ పై సంతకం పెట్టకుండానే శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇదే విషయం పై హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి, అధికారులు, పలువురు మంత్రులు వ్యవహరించిన తీరు పై, ఈ పిటీషన్ లో అభ్యంతరం తెలియ చేసారు. ఒక పక్క చట్టంలో అన్యమతస్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటే, డిక్లరేషన్ పై సంతకం చెయ్యాలని ఉన్నా, జగన్ మోహన్ రెడ్డి కానీ, అక్కడ ఉన్న అధికారులు, కానీ అడ్డుకోలేదని తెలిపారు. దేవాదాయచట్టంలోని 97, 153 సెక్షన్ల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వకుండా, అన్యమతస్తులు శ్రీవారిని దర్శించుకోకూడదని తెలిపారు. ఇక ఇన్ని ఉల్లంఘనలు జరుగుతున్నా చూస్తూ ఉన్నటీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ సింఘాల్‌ పై కూడా ఈ పిటీషన్ లో ఫిర్యాదు చేసారు. అలాగే మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి కూడా డిక్లరేషన్ ఇవ్వరు అని చేసిన వ్యాఖ్యలను కూడా జతపరిచారు. గుంటూరు జిల్లా వైకుంఠపురం గ్రామానికి చెందిన సుధాకర్‌బాబు అనే వ్యక్తి ఈ పిటీషన్ దాఖలు చేసారు. మరి కోర్టు ఈ కేసు అడ్మిట్ చేసుకుంటుందా, ఏమి వ్యాఖ్యలు చేస్తుంది అనేది చూడాలి

Advertisements

Advertisements

Latest Articles

Most Read