రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న గృహాలను లబ్దిదారులకు కేటాయించటంలో జరిగిన జాప్యంపై జుడిషియల్ విచారణ జరిపించాలాని తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తూ శ్రావణ్ కుమార్ తరపున ప్రముఖ న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు (పిల్) దాఖలు చేశారు. 'పిల్' లో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీయే, ఏపీ టీడ్కో, ఎఎంఆర్డీయే, కేంద్ర ప్రభుత్వ గృహనిర్మాణ శాఖ లను చేర్చారు. రాజధాని అమరావతి ప్రాంతంలో రూ.324 కోట్లు వ్యయం చేసి, 5,024 గృహాలను నిర్మించారని, అందుకు సంబంధించి లబ్దిదారుల ఎంపిక సైతం పూర్తయిందని ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఆయా గృహాల నిర్మాణంలో లబ్దిదారులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వాటా కలిగి ఉన్నాయన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షన్నర వంతున ప్రతి లబ్దిదారునికి సబ్సిడీ ఇచ్చినట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ఆయా గృహాలన్నీ దాదాపు 90 నుంచి 95 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్నాయని, ఇప్పటి వరకు లబ్దిదారులకు వాటిని అప్పగించలేదని 'పిల్' లో పేర్కొన్నారు. లబ్దిదారులు సైతం వారి వాటా ధనాన్ని చెల్లించినట్టు చెప్పారు. వాన్నింటినీ తక్షణమే లబ్దిదారులకు అప్పగించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని శ్రావణ్ కుమార్, న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఇప్పటివరకు వాటిని లబ్దిదారులకు అప్పగించకుండా జాప్యం జరుగటానికి గల కారణాలపై న్యాయవిచారణ జరపాలని 'పిల్' లో హైకోర్టును అభ్యర్థించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read