ఆయన పేరు అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ. బీజేపీ అధికార ప్రతినిధి అయినా, ఆయన ఎక్కువగా కోర్టుల్లోనే కనిపిస్తూ ఉంటారు. ఆయనకు పీఐఎల్ మ్యాన్ అని కూడా పేరు ఉంది. రాజకీయాలు కంటే, ఆయన ఎక్కువ కోర్తుల్లోనే గుడుపుతూ ఉంటారు. అయితే ఆయన గత వారం రోజులుగా, దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. దీని కారణం ఆయన సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ఆరోపణలు ఎదుర్కుంటూ, కేసులు ఉన్న ప్రజా ప్రతినిధుల కేసులు, ఏడాది లోపు విచారణ పూర్తవ్వాలి, అలాగే శిక్ష పడిన వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు. అయితే, ఈ తీర్పు ఇప్పుడు అమలు కావటం లేదు అంటూ, అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. ఈ కేసు పై, తమకు సహాయకారిగా ఉండాలి అంటూ, అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయని అమికస్‌ క్యూరీగా సుప్రీం కోర్టు నియమించింది. సుప్రీం కోర్టు కోరినట్టు, ఆరోపణలు ఎదుర్కుంటున్న నేతల జాబితీ మొత్తం, సుప్రీం కోర్టు ముందు పెట్టారు. ఇక ఇది సుప్రీం కోర్టులో అంశం, కేంద్రం ఇచ్చే సమాధానం బట్టి, దీని పై సుప్రీం కోర్టు తమ ఆదేశాలు ఇస్తుంది.

అయితే అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ, వివిధ నాయకులు ఎదుర్కుంటున్న కేసులు వివరాలు ప్రస్తావిస్తూ, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి కేసుప్రస్తావిస్తూ, గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన లాలూ, జయలలిత, కేసులు తేలి శిక్ష పడతనానికి 20 ఏళ్ళకు పైగా పట్టిందని, ప్రస్తుతం కేసులు నడుస్తున్న జగన్ మోహన్ రెడ్డికి, అంత కాలం కాకుండా, వీలు అయినంత త్వరగా విచారణ జరిగి, ఏదో ఒకటి తేలాలని అన్నారు. అందరితో పాటుగా, జగన్ మోహన్ రెడ్డి పై ఉన్న కేసులు కూడా ఏడాది లోపు తేల్చేయాలని, తమ పోరాటం ఇదే అని అన్నారు. వివిధ హైకోర్టుల్లో, ప్రజా ప్రతినిధుల పై ఉన్న కేసుల వివరాలు కోర్టుకు సమర్పించాలని, ఇదే క్రమంలో సిబిఐ, ఈడీ కూడా సుప్రీం కోర్టు ఇవ్వాలని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో అవినీతి బాగా పెరిగిపోయిందనే సమాచారం ఉందని, ఏపి ఎమ్మెల్యేలో 55 శాతం మంది నేరచరితులని సర్వే చెప్పిందని, స్యాండ్, ల్యాండ్, లిక్కర్, తదితర వాటిల్లో అనేక స్కాంలు జరుగుతున్నాయనే సమాచారం ఉందని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read