ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం రూపు మారుతుంది. గతంలో అభివృద్ధి, సంక్షేమం, లాంటి వాటి మీదే ఎన్నికలు జరిగేవి. 2019లో బీహార్ నుంచి దిగుమతి చేసుకున్న వ్యక్తి వల్ల , ఆంధ్రప్రదేశ్ సమాజం ఎప్పుడు లేనంతగా, కులాల వారీగా చీలిపోయింది. ఒక కులం అంటే మరొక కులానికి ద్వేషం పుట్టించేలా రాజకీయం చేసి, సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు కులం పక్కన పెట్టి, మతం వైపు ప్రజలను మళ్లించే ప్రయత్నాలు మొదలయ్యాయా అనే అనుమానం కలుగుతుంది. ఏది ఏమైనా ఇవ్వన్నీ చూస్తున్న అభివృద్ధిని కాంక్షించే వారికి, రాష్ట్రం పట్ల ప్రేమ ఉన్న వారికి మాత్రం, విచారం కలిగించే అంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 16 నెలలుగా, హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ, కొన్ని పనులు జరిగాయి అని, దీనికి వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు అనేది బీజేపీ, జనసేన ఆరోపణ. మత మార్పిడులు ఎక్కువ అయ్యాయని, దేవాదాయ శాఖ నిధులు మళ్ళిస్తున్నారని, దేవాదాయ భూములు అమ్ముతున్నారని, కావాలని గుళ్లని టార్గెట్ చేస్తున్నారని, ఇలా అనేక ఆరోపణలు వస్తూ వచ్చాయి. అలాగే పాస్టర్లకు జీతాలు ఇవ్వటం పై కూడా బీజేపీ అభ్యంతరం చెప్పింది. ఇవన్నీ జరుగుతూ ఉండగానే, అంతర్వేది రధం దగ్ధం కావటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. 62 ఏళ్ళ నాటి రధం దగ్ధం కావటంతో, సహజంగానే హిందువుల మనోభావాలు దెబ్బ తింటాయి.

అలాగే గతంలో నెల్లూరులోని బిట్రగుంటలో జరిగిన రధం దగ్ధం కూడా. అయతే ప్రభుత్వం, ఈ ఘటనలు వెనకాల ఎవరు ఉన్నది ? ఎవరు చేసింది తేల్చలేకపోయింది. పోలీసుల పైన ఈ విషయంలో విమర్శలు వస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బీజేపీ ఎంటర్ అయ్యింది. అంతర్వేది ఘటన పై గొడవ గొడవ చేసింది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ అంటూ కొంత మంది కుర్రకారు వచ్చి ఆందోళన చేసారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. సరిగ్గా ఇక్కడే ప్రభుత్వానికి మంచి అవకాసం దక్కినట్టు అయ్యింది. విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవటం, పోలీసులు ఏమి తేల్చలేదు అనే విమర్శలు వస్తున్న టైంలో, ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం పట్టుకోలేకపోయింది అనే విమర్శ రాదు. బీజేపీ గట్టిగా అడగటానికి ఉండదు. బాల్ ఇప్పుడు సిబిఐ కోర్టులో ఉంది. ఏదైనా సిబిఐ తేల్చాలి. ఒక్క దెబ్బతో, బాల్ బీజేపీ కోర్టులోకి నెట్టిన జగన్, ఈ విషయంలో బీజేపీ మరోసారి విమర్శలు చెయ్యకుండా చెక్ పెట్టారు. మరి బీజేపీ నేతలు, కేంద్రంతో మాట్లాడి, ఈ అంశం పై సిబిఐ విచారణకు అంగీకరించేలా చేసి, విచారణ వేగవంతం అయ్యేలా చేసి, అసలు నిజం బయట పెట్టేలా కేంద్రం పై ఒత్తిడి తెస్తారో లేదో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read