వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొరకరాని కొయ్యగా, ప్రతి రోజు తన ప్రెస్ మీట్లతో, ప్రతిపక్షం కంటే ఎక్కువగా ప్రజా సమస్యలు చెప్తూ, ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెస్తూ, అలాగే ప్రభుత్వంలో పని చేస్తూ, కొంత మంది వ్యక్తులు చేస్తున్న పనులు, కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యే చేస్తున్న పనులను బహిరంగంగా విమర్శిస్తూ, వైసీపీని ప్రతి రోజు ఇబ్బంది పెడుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు, వైసీపీ పార్టీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. తాను చేసిన చాలెంజ్ కు ఒకే అంటే రాజీనామాకు రెడీ అని చెప్పారు. రఘురామకృష్ణం రాజుని ఎలాగైనా వదిలించుకోవాలని, వైసిపీ పార్టీ అనేక ప్లాన్లు వేసింది. ఆయనకు షోకాజ్ నోటీస్ పంపించగా, ఏకంగా పార్టీ పేరు మీదే పంచాయతీ పెట్టిన రాజు గారు, చివరకు పేరు పై ఢిల్లీ హైకోర్టులో కేసు వేసే దాకా ఇష్యూ ని తీసుకు వెళ్లారు షోకాజ్ నోటీస్ ఫెయిల్ అవ్వటంతో, రఘురామ కృష్ణం రాజు ఎంపీ పదవికి అనర్హత వేటు వెయ్యాలి అంటూ, పార్లమెంట్ స్పీకర్ కు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ వెళ్లి ఫిర్యాదు చేసారు. అయితే రఘురామ రాజు మాత్రం, ఇక్కడ కూడా ట్విస్ట్ ఇచ్చారు.

తాను ఎక్కడైనా జగన్ గారిని కానీ, పార్టీని కానీ విమర్శించినట్టు ఉందా అని ప్రశ్నించారు. పార్టీ, ప్రభుత్వం వేరు అని, ప్రభుత్వం తప్పు చేస్తుంటే, సరిదిద్దే బాధ్యత రాజ్యాంగ కల్పించిన హక్కు అని అన్నారు. ఇక ఇది కూడా ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు. దీంతో ఆయన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. రాజీనామా చెయ్యాలి అంటూ ప్రతి రోజు విసిగిస్తున్నారు. ఈ రోజు కూడా మంత్రి బాలినేని రఘురామ రాజు రాజీనామా చెయ్యాలని, డిమాండ్ చేసారు. అయితే మొన్నటి దాకా నేను రాజీనామా చెయ్యను అని చెప్పిన రఘురామరాజు, ఈ రోజు వైసీపీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. బాలినేని డిమాండ్ చేసినట్టు నేను రాజీనామాకు రెడీ అని, కాకపొతే నేను రాజీనామా చేసి, అమరావతి రిఫరెండంతో మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తానాని, నేను మళ్ళీ గెలిస్తే అమరావతి ఇక్కడ నుంచి కదలదు అని జగన్ గారి చేత చెప్పించండి, నేను రాజీనామా చేస్తే, ఎన్నికలకు వెళ్లి అమరావతి రిఫరెండంతో ఓట్లు అడుగుదాం అంటూ, అదిరిపోయే సవాల్ విసిరారు. మరి జగన్ గారు కానీ, 151 మంది ఉన్న వైసీపీ పార్టీ కానీ, ఒక్కడు వదిలిన ఛాలెంజ్ కు రెడీ అంటారా ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read