కేంద్ర ప్రభుత్వం పై ఎన్డీఏ భాగస్వామ్యం కానీ రాష్ట్రాలు అన్నీ పోరాటానికి సిద్ధం అవుతున్నాయి. చాలా రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా లేఖలు రసారు. కేసిఆర్ అయితే కేంద్ర వైఖరి పై కోర్టుకు కూడా వెళ్తాం అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం, ఈ విషయంలో పెద్దగా వాయిస్ వినిపించటం లేదు. ఆర్ధిక మంత్రి బుగ్గన దీని పై క్లారిటీ ఇస్తే, చూద్దామని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక విషయానికి వస్తే, దేశంలో జీఎస్టీ వసూళ్ళు భారీగా తగ్గిపోయాయి. అటు రాష్ట్రాలకు వసూళ్ళు లేకపోవటంతో, కేంద్రం పై కూడా ఈ భారం పడింది. జీఎస్టీ రీయింబర్స్మెంట్ విషయంలో, కేంద్రం చేతులు ఎత్తేసింది. ఈ విపత్తు ఆక్ట్ అఫ్ గాడ్ అని, దీనికి కేంద్రం ఏమి చెయ్యలేదని, రాష్ట్రాలు సహకారం అందించాలని కోరింది. అవసరం అయితే ఆర్బీఐ నుంచి అప్పు తెచ్చుకోండి అంటూ సలహా ఇచ్చింది. అయితే కేంద్రం చేసిన ప్రకటన పై అన్ని రాష్ట్రాలు భగ్గు మన్నాయి. చివరకు కొన్ని ఎన్డీఏ రాష్ట్రాలు కూడా ఈ ప్రతిపాదన పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీఎస్తీ లాసులు రీయింబర్స్మెంట్ చేస్తామని కేంద్రం హామీ ఇస్తేనే, అందరం జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలపాం అని, ఇప్పుడు కేంద్రం చేతులు ఎత్తేసి ఆక్ట్ అఫ్ గాడ్ అంటూ, మాకు సంబంధం లేదని చెప్తే ఎలా అంటూ పలు రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేసారు.
తెలంగాణా ఆర్ధిక మంత్రి హరీష్ రావు అయితే, కేంద్రం జీఎస్టీ చట్టం చేసిందని, ఆ చట్టం ప్రకారం జీఎస్తీ లాసులు రీయింబర్స్మెంట్ చెయ్యాలని, అలా చెయ్యకపోతే కేంద్రం పై కోర్టు వెళ్లేందుకు కూడా వెనకాడం అంటూ, వ్యాఖ్యానించారు. ఇక ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఈ విషయం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాసారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత, కేరళ ముఖ్యమంత్రి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, తమిళనాడు ముఖ్యమంత్రి పలనీర్ స్వామీ , తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్, చత్తీస్గడ్ ముఖ్యమంత్రి బూపేష్, కేంద్రానికి లేఖలు రాసారు. వీరందరూ ఎన్డీఏతర పార్టీల ముఖ్యమంత్రులు. అయితే ఈ లిస్టు లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లేరు. ఆయన ఈ విషయం పై కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదో ఎవరికీ అర్ధం కాలేదు. రావాల్సిన హక్కు గురించి పోరాడకుండా, ఎక్కువ అప్పు తీసుకోవటానికి కేంద్రం సూచించిన రిఫార్మ్స్ ని ఇంప్లెమెంట్ చేస్తూ, విద్యుత్ మోటార్లకు స్మార్ట్ మీటర్లు లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మనకు రావాల్సిన హక్కు పై జగన్, ఇతర రాష్ట్రాలు లాగా కేంద్రం పై గట్టిగా పోరాడాలని, ప్రతిపక్షాలు అంటున్నాయి.