తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తృటిలో ప్రామాదం తప్పింది. చంద్రబాబు కాన్వాయ్ లోని ఒక వాహనానికి ప్రమాదం కావటంతో, మిగతా రెండు వాహనాలు గుద్దుకున్నాయి. చంద్రబాబు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా, ఈ ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే పై ఆవు అడ్డురావడంతో, కాన్వాయ్ లోని ఒక వాహనం సడన్ బ్రేక్  వెయ్యటంతో కార్లు ఒకదానికి ఒకటి గుద్దుకున్నాయి. ఎన్ఎస్జీ వాహనం ముందుగా సడన్ బ్రేక్ వెయ్యగా, దాని వెనుక ఉన్న జామర్ వాహనం ముందు వాహనాన్ని డీ కొట్టింది. అయితే జామర్ వాహనం వెనుక చంద్రబాబు వాహనం ఉంది. జామర్ వాహనం సడన్ బ్రేక్ వేయటం గమనించి, చంద్రబాబు డ్రైవర్ అప్రమత్తం అవ్వటంతో, చంద్రబాబు సేఫ్ గా బయట పడ్డారు. అయితే, సిబ్బందికి కొన్ని స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తుంది. అయితే దెబ్బ తిన్న వాహనం చూస్తే పెద్ద  ప్రమాదం తప్పింది అనే చెప్పాలి. తెలంగాణాలోని చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం దగ్గర ఘటన జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన తరువాత, చంద్రబాబు కాన్వాయ్, 15 నిమిషాల పాటు హైవే పైనే ఉన్నారు. అయితే ఈ ప్రమాదం పై తెలుగుదేశం శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జెడ్ ప్లస్ బద్రత ఉన్న వ్యక్తికి రూట్ క్లియరెన్స్ లో అలసత్వం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే చంద్రబాబుకి ఏమి కాకపోవటం, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read