విశాఖపట్నం శిరోమండనం కేసులో నూతన్ నాయుడుని పోలీసులు అరెస్ట్ చేసారు. ఆయన ముంబై పారిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా, కర్ణాటకలోని ఉడిపి రైల్వే స్టేషన్లో పోలీసులు పట్టుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి, ఏపి పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. అరెస్ట్ సమయంలో నూతన్ నాయుడు దగ్గర కొన్ని ఫోనులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ సమయంలో నూతన్ నాయడు ఆ ఫోన్ ని పక్కకు పడవేసే ప్రయత్నం చేసారు. అయితే ఆ విషయన్ని పసిగట్టిన పోలీసులు, ఆ ఫోన్ ని కూడా స్వాదీనం చేసుకున్నారు. అయితే ఆ ఫోన్ ని పరిశీలించిన పోలీసులకు సంచలన విషయాలు తెలుసుకున్నారు. నూతన్ నాయుడు గతంలో చేసిన దందాలు మోసాలకు సంబందించిన కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నూతన్ నాయుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మొన్నటి వరకు జగన్ పేషీలో ఉన్న పీవీ రమేష్ పేరుతో పలువురికి ఫోనులు చేసి, మోసం చేసినట్టు, పోలీసులు కనుకున్నారు. తన భార్యని పోలీసులు అరెస్ట్ చెయ్యకుండా అడ్డుకునేందుకు, నూతన్ నాయుడు పీవీ రమేష్ పేరుతొ పలువురు వైద్య అధికారులకు ఫోనులు చేసి, తాను సియం పేషీ నుంచి మాట్లాడుతున్నాను, ఆమెకు ఆరోగ్యం బాగోనట్టు సర్టిఫికేట్ ఇవ్వమని కోరారు.
అయితే ఆ ముగ్గురు వైద్య అధికారులకు అనుమానం వచ్చి, నేరుగా అసలైన పీవీ రమేష్ కు ఫోన్ చేసి, ఇందాక ఫోన్ చేసారా అని ఆరా తీయగా, అసలు విషయం తెలిసింది. అయితే ఈ విషయం గుర్తించిన పీవీ రమేష్ విశాఖ పోలీసులకు కూడా విషయం తెలియ చేసారు. తన పేరుతో ఎవరో ఫోనులు చేస్తున్నారు, దాని పై ఆరా తియ్యమని పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీని పై విచారణ కొనసాగుతూ ఉండగానే, నూతన్ నాయుడు పోలీసులకు దొరికారు. ఆయన ఫోన్ పరిశీలించగా అసలు విషయం బయట పడింది. పోలీసులు విచారణ చేయగా, వైద్య అధికారులకు ఫోన్ చేసింది, ఈ నంబర్ నుంచే అని గుర్తుంచారు. దీంతో నూతన్ నాయుడే పీవీ రమేష్ పేరుతో ఫోన్ చేసారని పోలీసులు గుర్తించారు. అలాగే మరో 30 మందికి నూతన్ నాయుడు, పీవీ రమేష్ పేరుతొ ఫోనులు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఒక దశలో గాజువాక సిఐకి కూడా ఫోన్ చేసినట్టు బెదిరించినట్టు, తెలిసింది. అయితే ఎదుటి వారిని నమ్మించటానికి, ట్రూ కాలర్ లో కూడా, ఏపి సియంఓ అని స్టోర్ చేసి, నిజంగానే పీవీ రమేష్ అని నమ్మించే ప్రయత్నం చేసారు. అయితే పోలీసులు ఈ మొత్తం వ్యవహరం పై ఆరా తీస్తున్నారు. ఇక పీవీ రమేష్ కూడా ఈ విషయం పై ట్వీట్ చేస్తూ, అప్రమత్తం చేసారు. నా పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే, నమ్మవద్దని కోరారు.