ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అమరావతి సెగ గట్టిగా తగులుతుంది. అమరావతి రైతులను, వాళ్ళు పడుతున్న ఇబ్బందులను చూస్తున్న మిగతా ప్రాంతాల వారు, ప్రభుత్వానికి భూములు ఇవ్వాలి అంటేనే ససే మీరా అంటున్నారు. ఎంత పరిహారం ఇస్తాం అన్నా, ఏమి చేస్తాం అన్నా, మేము మాత్రం భూములు ఇవ్వం అంటున్నారు. మొన్నా మధ్య అమరావతి ప్రాంతంలోనే, గోదావారి - పెన్నా మహాఅనుసంధానికి, భూసమీకరణ కోసం వెళ్ళగా, అక్క ప్రజలు, అధికారులతో గొడవ పడి, మేము మీకు భూములు ఇవ్వం, ఎంత పరిహారం ఇచ్చినా ఇవ్వం, రేపు వేరే ప్రభుత్వం వచ్చి, ఇక్కడ ప్రాజెక్ట్ కట్టం అంటే మా పరిస్థితి ఏంటి ? ఇప్పుడు అమరావతి రైతుల పరిస్థితే మాకు వస్తే, ఏమి చెయ్యాలి అంటూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఇలాంటి పరిణామే మరొకటి ఎదురు అయ్యింది. చంద్రబాబు హయంలో, గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి కేంద్రం, భూసమీకరణ చేసి ఇస్తే, సహాయం చేస్తాం అని చెప్పింది. దీని కోసం, గన్నవర చుట్టు పక్కల గ్రామాల్లో, దాదాపుగా 700 ఎకరాలు కావాల్సి వచ్చింది. అయితే చంద్రబాబు హయంలో కూడా, ఇక్కడ భూసమీకరణ చెయ్యటానికి చాలా ఇబ్బంది పడ్డారు. చాలా ఖరీదు అయిన భూమి కావటంతో రైతులు ముందుకు రాలేదు.
అయితే అప్పటి ప్రభుత్వం, ఇక్కడ భూములు ఇస్తే, అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కింద భూమి ఇస్తాం అని రైతులని ఒప్పించింది. దీంతో రైతులు కూడా అమరావతిలో భూమి ఉంటుందని ఆలోచింది, భూమి ఇచ్చారు. చాలా మందికి అమరావతిలో ఫ్లాట్ కేటాయింపు కూడా జరిగిపోయింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం అమరావతి మీద తీసుకున్న నిర్ణయంతో, అమరావతి నిర్వీర్యం అయిపొయింది. దీంతో ఇప్పుడు గన్నవరం రైతులు ఆలోచనలో పడ్డారు. ఖరీదైన భూములు ఇచ్చి, ఇప్పుడు అమరావతిలో ఏమి చెయ్యకుండా చేస్తాం అంటే, మాకు కుదరదు అని ఎదురు తిరిగారు. కొంత మంది రైతులు ఈ ఏడు సాగు కూడా ప్రారంభించారు. ఇక అలాగే ఇక్కడ ప్రముఖ నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్ కు కూడా ఇక్కడ భూములు ఉన్నాయి. వీరి నుంచి భూమిని ఎయిర్ పోర్ట్ అథారిటీకి ఇప్పించాలి అంటూ, కలెక్టర్ కు ఎయిర్ పోర్ట్ అధికారులు లేఖ రాయటంతో, కృష్ణా కలెక్టర్ రంగంలోకి దిగి వారితో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. అయితే వారు మాత్రం, ససేమీరా అన్నారని సమాచారం. అమరావతిలో అభివృద్ధి చేసిన భూమి ఇస్తాం అని ఒప్పందం చేసుకుని, ఇప్పుడు అక్కడ ఏమి చెయ్యం అంటుంటే, మేము ఎలా భూములు ఇస్తాం అని ఎదురు తిరిగారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ విషయం పెద్ద భారంగా మారింది. మరి ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి.