చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారు. చంద్రబాబు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అన్నారు. ఇలా గత కొన్నేళ్లుగా చంద్రబాబు పై ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు, ఇన్నేళ్ళలో ఎప్పుడూ, చంద్రబాబు చెప్పినట్టు ఒక వీడియో చూపించింది లేదు. రాజకీయ పార్టీలు చేసే రాజకీయంలో ఇది ఒక భాగం. చంద్రబాబు 1995 ముఖ్యమంత్రి అయిన తరువాత, 1999 ఎన్నికల్లో తానే సియం అని వైఎస్ఆర్ అనుకున్నారు. కానీ మళ్ళీ చంద్రబాబు గెలిచారు. ఇక ఆ గెలుపు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రనే మార్చేసింది. చంద్రబాబు తెచ్చిన ఐటి, విద్యుత్ సంస్కరణలు, జీవన విధానాన్నే మార్చేసాయి. ఇదే సమయంలో ప్రకృతి సహకరించక పోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే ఆయిధంగా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్, పాదయాత్ర చేసి, తాను అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తానని, ఇచ్చిన హామీ, రైతులలో ఒక ఊపు ఊపేసింది. ఆ ఉచిత విద్యుత్ హామీతోనే చంద్రబాబు 2003లో ఓడిపోయారు. ఎంత అభివృద్ధిలో పరుగులు పెట్టించినా, ఉచిత విద్యుత్ హామీ ముందు నిలవలేక పోయింది. గతంలో ఎన్టీఆర్ 50 రూపాయలకే హార్స్ పవర్ కరెంటు ఇస్తే, చంద్రబాబు తెచ్చిన విద్యుత్ సంస్కరణలతో, వైఎస్ఆర్ కు ఉచిత విద్యుత్ ఇవ్వటం సాధ్యం అయ్యింది.

అయితే ఆ ఉచిత విద్యుత్ హామీ, చంద్రబాబు కోసం వైఎస్ఆర్ తవ్విన గొయ్యి. కానీ చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తరువాత, ఉచిత విద్యుత్ కొనసాగించారు, అంతే కాదు క్వాలిటీ కరెంటు పగట పూట ఇచ్చారు. ఇక రైతు రధం, మైక్రో న్యూట్రియంట్స్, రుణ మాఫీ, అన్నదాత సుఖీభవ, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ, ప్రకృతి వ్యవసాయం, ఇలా అనేక పధకాలు రైతుల కోసం తెచ్చి, తన పై చేసిన ప్రచారాన్ని చెరిపి వేసుకుని, రైతుల పక్షాన నిలబడ్డారు. అయితే గతంలో ఏ ఉచిత విద్యుత్ తో అయితే, చంద్రబాబుకి గొయ్యి తవ్వి ఇబ్బంది పెడదాం అని వైఎస్ఆర్ అనుకున్నారో, ఇప్పుడు ఆ గోయ్యాలో, జగన్ మోహన్ రెడ్డి పడబోతున్నారా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కేంద్రం నుంచి ఎక్కువ అప్పు తెచ్చుకోవటానికి, ఉచిత విద్యుత్ బదులు, నగదు బదిలీ చేస్తాం అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, తీసోకొచ్చిన ఈ కొత్త సంస్కరణతో రైతులు షాక్ అయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం లెక్క మాత్రం వేరే ఉంది.

తాము ఉచిత విద్యుత్ ఎత్తివేయటం లేదని, కేవలం మీటర్లు పెట్టి, ఎంత వాడుకుంటే అంత, నగదు రైతు ఎకౌంటు లో వేస్తాం అని, రైతు కట్టుకోవటమే అని ప్రభుత్వం అంటుంది. రూపాయి కూడా రైతులు కట్టనవసరం లేదని, మేము హామీ అంటూ, అలా చేస్తే రాజీనామా చేస్తాం అంటున్నారు. అయితే ఇక్కడ అనేక అనుమనాలు రైతులకు వస్తున్నాయి. గతంలో కిరణ్ సర్కార్ ఈ మీటర్లు పెడతాం అన్నప్పుడు, జగన్ గారి సాక్షి టీవీలోనే దీని పై విశ్లేషణ ఇచ్చారు. ఇప్పుడు ఇలాగే చెప్తారని, చివరకు గ్యాస్ సబ్సిడీ లాగా అవుతుందని, జగన్ గారి సాక్షి నాడు వ్యతిరేకించింది. అంతే కాదు, ఇక్కడ కౌలు రైతుల పరిస్థితి ఏమిటి అనేది ఎవరికీ అర్ధం కాని ప్రశ్న. ఇక రైతులు ఆ డబ్బులు వేరే అవసరాలకు వాడుకుంటే పరిస్థితి ఏమిటి ? తరువాత కేంద్రం మరిన్ని ఆంక్షలు పెడితే, మన జుట్టు కేంద్రానికి ఇచ్చినట్టే కదా. ఇలా రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఈ నిర్ణయంతో నెలకొంది. సీనియర్ విశ్లేషకులు లెక్క ప్రకారం, గతంలో వైఎస్ఆర్, ఉచిత విద్యుత్ తో, చంద్రబాబు కోసం గొయ్యి తవ్వితే, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి దాంట్లో పడ్డారని, ఈ నిర్ణయంతో జగన్ భారీ వ్యతిరేకత మూట కట్టుకుంటారని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read