ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల పై దాడులు జరుగుతున్న వేళ, మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.మంగళగిరి పట్టణంలోని, 27 వవార్డులో ఉన్న రామాలయం ప్రహరీ గోడ కూలిపోవటం, అలాగే రామాలయం గర్భగుడికి కూడా ప్రమాదం వాటిల్లిందని స్థానికులు వాపోతున్నారు. 2019 ఏప్రిల్‌లో, స్థానికులు అందరూ కలిసి, ఇక్కడ రాములవారి గుడి కట్టుకున్నారు. అప్పటి నుంచి ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయి. అయితే రామాలయం పక్కన ఉన్న ఖాళీ స్థానంలో కమ్యూనిటీ హాల్ కడతామని, ఎమ్మెల్యే ఆర్కే చెప్పారని స్థానికులు అంటున్నారు. అయితే అక్కడ కమ్యూనిటీ హాల్ వద్దని, స్థానికులు ఎంత మొత్తుకున్నా, మేము అక్కడ కమ్యూనిటీ హాల్ కడటానికి నిర్ణయం తీసుకున్నామని, నిర్ణయం అయిపోయిందని ఎమ్మెల్యే గతంలో చెప్పారని, స్థానికులు ఎంత మొత్తుకున్నా, అక్కడ కమ్యూనిటీ హాల్ కడటానికి నిర్ణయం తీసుకున్నారని వాపోయారు స్థానికులు. కొద్ది రోజుల క్రితం, అక్కడ పనులు కూడా మొదలు పెట్టారు.
అయితే అక్కడ గుడికి ఇబ్బంది అవుతుందని స్థానికులు గోల చెయ్యటంతో, గుడి ప్రహరీ గోడకు 3 మూడు మీటర్లు వదిలి పునాది తవ్వుతామని ఎమ్మెల్యే మాట ఇచ్చారని, ఇప్పుడు మాత్రం ఏకంగా గర్భగుడి వరకు తవ్వేసారని, ఇప్పుడు గుడి ప్రహరీ గోడ పడిపోవటంతో పాటుగా, తవ్వకం చేయటం వల్ల గర్భ గుడికి ప్రమాదం జరిగిందని స్థానికులు వాపోతున్నారు. 18-20 అడుగుల గొయ్యు తవ్వితో గుడి పడిపోతుందని ఎంత చెప్పినా వినిపించుకోలేదని, అక్కడ గుడి లేకుండా చెయ్యాలని, అందరూ కలిసి ఆడుతున్న డ్రామా అంటూ స్థానికులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. స్థానికి తెలుగుదేశం నేతలు ఎమ్మెల్యే ఆర్కే ని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారు. అక్కడ గుడి కూడా లేకుండా ప్లాన్ చేసారని, అసలు అక్కడ ఎమ్మేల్యే ఎందుకు అంత అత్యుత్సాహం చూపిస్తున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ వివాదం పై ఎమ్మెల్యే ఇంకా స్పందించలేదు.