తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే మూల స్థంభాలనీ, ఏ కష్టం వచ్చినా అందుకోవడానికి ఎప్పుడు ముందుంటానని, అధైర్యపడవద్దని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో అనంతపురం లోని కోడూరు ఎస్సీ కాలనీకి చెం దిన టీడీపీ నాయకుడు నరసింహప్ప మృతిచెందగా ఆ కుటుంబానికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అండగా నిలిచారు. బుధవారం మృతుడి కుటుంబ సభ్యులను ఫోనులో పరామర్శించి మనోధైర్యాన్ని అందించి రూ.1.5 లక్షలు సాయం అందించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాలతో బుధవారం చిలమత్తూరు మాజీ జడ్పీటీసీ లక్ష్మినారాయణరెడ్డి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి దేమకేతపల్లి అంజినప్ప, కన్వీనర్ రంగారెడ్డి, బాలాజీ, డీఎన్. పాపన్న, బేకరీ గంగా ధర్, రజనీకాంత్, వెంకటేష్, అశ్వర్ణ, నంజుండ, సూ ర్యనారాయణ, గాజుల కిష్టప్ప, గంగాధర్, నరేష్, భాస్కర్, నరసింహులు తదితరులు బాధితుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఎమ్మెల్యే అందించి రూ.1.5 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్ బాండును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మృతుడు కుటుంబ సభ్యులతో ఎ మ్మెల్యే బాలకృష్ణ ఫోన్లో మాట్లాడుతూ పిల్లలను బాగా చదివించుకోవాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని అభయమిచ్చారు. అదే విధంగా స్థానిక నాయకులు ఆ కుటుంబానికి తమవంతుగా ఆర్థిక సాయం అందించారు. కుటుంబానికి అండగా నిలిచి నందుకు బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి, స్థానిక టీడీపీ నాయకు లకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా తుమ్మలకుంటపల్లిలో అనా నాయకులు రోగ్యంతో బాధపడుతున్న టిడిపి నాయకుడు కోళ్ల గంగాధరప్ప ఇంటికి వెళ్లి పరామర్శించారు. వైద్యం ఖర్చుల కోసం ఎమ్మెల్యే అందించిన రూ. 10వేలను అందజేశారు. కష్టాల్లో ఉన్న ప్రతి కార్యకర్తను ఆదుకునేందుకు మా నాయకుడు ఎమ్మెల్యే బాలకృష్ణ సిద్ధంగా ఉంటాడని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఆ ఫోన్ సంబాషణ ఇక్కడ వినవచ్చు. https://youtu.be/6HghgmExM0A