సహజంగా క్వారీలలో గొడవలు, ఆధిపత్యం కోసం, ఆర్ధిక లావాదేవీల విషయంలో జరుగుతూ ఉంటాయి. ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటూ ఉంటారు. సహజంగా ఇలాంటి వార్తలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం వింటున్న వార్త, ఆ క్వారాల్లో పని చేసే వారు ఆధిపత్యం కోసం గొడవ పడిన వార్త. కృష్ణా జిల్లా, కంచికచర్ల మండలంలో, అనేక రాళ్ళ క్వారీలు ఉన్నాయి. ఈ మధ్య అక్రమ మైనింగ్ కూడా జరుగుతుంది అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు గొడవ చేసింది ఈ ప్రదేశంలోనే. అయితే అది వేరే వివాదం. దీనికి దానికి ఏమి సంబంధం లేదు. కంచికచర్ల మండలంలోని పరిటాలలో ఉన్న రాళ్ళ క్వారీలో ఈ రోజు గొడవ జరిగింది. ఇసుక స్టాక్ పాయింట్ సమీపంలో, ఈ రాళ్ల క్వారీ ఉంది. అయితే సీరియల్ లు, క్యు లైన్ల విషయంలో, టిప్పర్ల డ్రైవర్ల మధ్య గొడవ జరిగింది. చిన్నగా ప్రారంభం అయిన ఈ గొడవ, పెద్ద గొడవగా మారి, పోలీసులు వచ్చి, కలుగ చేసుకునే దాకా వచ్చింది.
సీరియల్ విషయంలో గొడవ జరగటంతో, డ్రైవర్లు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒకరి పై ఒకరు పిడి గుద్దులు గుడ్డుకున్నారు. తరువాత క్వారీలో ఉన్న రాళ్ళు రువ్వుకుంటూ , గందరగోళం సృష్టించారు. దీంతో పలువురు డ్రైవర్లకు గాయాలు అయ్యాయి. ఎంత సేపటికీ గొడవ సద్దుమణగక పోవటం, అలాగే అక్కడ ఉన్న నిర్వాహుకుల మాట వినకపోవటంతో, పోలీసులను పిలవాల్సి వచ్చింది. పోలీసులు వచ్చి, ఇరు వర్గాలను శాంతింప చేసారు. అయితే వారి పై కేసులు పెడతారా, లేదా అనే విషయం తెలియదు కానీ, గొడవ అయితే సద్దుమణగటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన వివరాలు, గొడవ జరిగిన తీరు, ఈ వీడియోలో చూడవచ్చు https://youtu.be/u3cWHjMnm0s