ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ, ప్రభుత్వంలో తమకు జరుగుతున్న అన్యాయం పై స్పందించారు. ఆరు నెలలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సెక్రటేరియట్ కు రావటం లేదని అన్నారు. సమస్యల మీద వచ్చే విజిటర్స్ ని కలిసే వారే లేరని అన్నారు. ఆ రకంగా వారు వ్యవహరిస్తే, వారిని అనుసరించి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా, కేవలం 30 నుంచి 50 శాతం మంత్రి మాత్రమే సెక్రటేరియట్ కు వచ్చి విజిటర్స్ ని కలిసే పరిస్థతి ఉందని అన్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పనిచేసే ఉద్యోగులకు మాత్రం, టార్గెట్లు పెట్టి మరీ ఆదేశాలు ఇస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని అన్నారు. అలాగే తమకు రావల్సినే బకాయల పై, ప్రభుత్వం కూడా ఈ విషయంలో అలోచించి, విడతల వారీగా అయిన సరే, ఆర్ధిక ప్రయోజనాల విషయంలో, వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. మార్చి, ఏప్రిల్ నెల జీతం, అలాగే మార్చి నెల పెన్షన్ రావాల్సి ఉందని, కొద్ది రోజులు సహకరించమని కోరారని, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని, అది కూడా తొందరగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలిపారు.

తమకు ఏదో భారీగా పెండింగ్ ఉన్నట్టు ఆర్ధిక శాఖ అధికారులు జగన్ మోహన్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టిస్తున్నారని, తమకు ఇప్పటికే సగం జీతం ఇచ్చారు కాబట్టి, ఇంకో సగం ఇవ్వాలని, ఆ సగంలోనే అనేక డిడక్షణ్ లు ఉంటాయని, తమకు వచ్చేది చాలా తక్కువే అని అన్నారు. ఇక అలాగే తమకు ఇప్పటికే 5 డీఏలు పెండింగ్ ఉన్నాయని, వీటిని అడుగుతుంటే, కేంద్రం రెండు డీఏలు ఇవ్వలేదు కాబట్టి, తాము ఇవ్వం అంటున్నారని, అసలు కేంద్రానికి, రాష్ట్రానికి సంబంధం లేదని, తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇక అలాగే, తమకు వేతన సవరణ జరగాల్సి ఉందని, ఒక కమిటీ వేసారని, అది వేసి ఏడాది అయ్యిందని, ఇప్పటికీ ఆతీ గతి లేదని, దాన్ని పొడిగించుకుంటూ వెళ్తున్నారని, ఇది సరి కాదని అన్నారు. ఉద్యోగులు రిటైర్ అయితే, రావాల్సిన బెనిఫిట్స్, గత మూడు నెలలుగా ఇవ్వటం లేదని, ఇది ఎంతో దారుణమైన విషయం అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read